Begin typing your search above and press return to search.

గాగ్ ఆర్డర్: జగన్ సర్కార్ సుప్రీంలో భారీ ఊరట

By:  Tupaki Desk   |   25 Nov 2020 3:30 PM GMT
గాగ్ ఆర్డర్: జగన్ సర్కార్ సుప్రీంలో భారీ ఊరట
X
సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం విశేషం.

జగన్ సర్కార్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి వర్తింపచేశారని.. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని వాదించారు. అమరావతిలో మేజర్ స్కాం జరిగిందని.. దీనిపై దర్యాప్తు జరగాలని కోరారు. బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారన్నారు. అమరావతిలో భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సిట్ పై హైకోర్టు స్టే విధించిందన్నారు.. దీంతో సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని కోర్టుకు తెలిపారు.

అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణ జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి దాకా ఈ కేసును ఫైనల్ డిసైడ్ చేయొద్దని హైకోర్టును ఆదేశించింది.

నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయొద్దా.. అడ్వకేట్ జనరల్‌గా పని చేసినంత మాత్రాన ప్రతీకారం పేరుతో దర్యాప్తు జరగొద్దని అంటారా.. దర్యాప్తు వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు, ఏది జరగకూడదా అని రాజీవ్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు చేస్తే ఇబ్బంది ఏంటని రాజీవ్ ప్రశ్నించారు. మధ్యంతర ఆదేశాలు ఎలా ఇస్తారని.. మీడియాపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదన్నారు.

సహారా కేసులో మీడియాపై గ్యాగ్ ఆర్డర్ విషయంలో నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయని.. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్.. రాజకీయ దురుద్దేశంతో సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ లిటిగేషన్ వేస్తున్నారన్నారు.

ఇటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపంచారు. గత ప్రభుత్వంలో శ్రీనివాస్ ఏజీగా పని చేశారని.. అందుకే టార్గెట్ చేశారన్నారు. రాజధాని అనేది రహస్యం కాదు, అది అందరికీ తెలుసు.. రాజధానిలో భూములు కొనవద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ వేకెట్ చేయమని అడగాలని సూచించారు.