Begin typing your search above and press return to search.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గోడెక్కిన యువతి… చనిపోవడానికి కాదంట!
By: Tupaki Desk | 11 Jun 2023 6:35 PM GMTశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. శనివారం రాత్రి విమానాశ్రయంలో శ్వేత అనే యువతి హల్ చల్ చేసింది. ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ అధికారులు యువతిని రక్షించారు. అయితే తాను చనిపోవాలని అనుకోలేదని, జస్ట్ తన భాగస్వామిని బెదిరించడానికే అలా చేశానని, కాని అనుకోకుండా కాలు జారడం వల్ల ఇబ్బంది వచ్చిందని చెబుతుండటం కొసమెరుపు.
అవును... శంషాబాద్ విమానాశ్రయం నుంచి దూకేస్తానని బెదిరించి జారిపడ్డ 21 ఏళ్ల టెక్కీని అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ కమాండోలు రక్షించారు.
ఫుల్ రద్దీగా ఉండే సాయంత్రం 6.45 గంటల సమయానికి ఈ ఘటన జరిగింది. సదరు మహిళ తన భాగస్వామితో గొడపడింది. అనంతరం భూమి నుంచి 38 అడుగుల ఎత్తులో ఉన్న అరైవల్ సెక్షన్ గోడ ఎక్కి దూకేస్తానని బెదిరించింది.
అయితే ఆమె నిజంగా దూకలేదు కానీ... ప్రమాదవశాత్తు జారిపడి రాడ్ కు చిక్కుకుంది. ఆమె రాడ్ కు వేలాడుతూ ఉండటం గమనించిన సమీపంలోని జనం ఆమెను రక్షించేందుకు పరుగెత్తగా... అది గమనించిన పోలీసులు, సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బందీ ఆమెను రక్షించారు.
ఆమెను రక్షించిన అనంతరం పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే తాను డిస్టర్బ్ అయ్యానని.. తన జీవితాన్ని అంతం చేసుకోవాలని మాత్రం అనుకోలేదని.. తన భాగస్వామిని బెదిరించడానికే ఇలా చేశానని ఆ మహిళ పోలీసులకు తెలిపింది.
బెంగళూరుకు చైందిన ఆ అమ్మాయి శ్వేత, కర్నూలు శ్రీరంగాపురానికి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి... సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రేమలో ఉన్న ఈ జంట... గచ్చిబౌలి పరిశరాల్లో ఆఫీస్ స్థలాన్ని వెతుక్కోవడానికి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తుంది!