Begin typing your search above and press return to search.
మిస్టర్ 360.. ఓడిపోయే జట్టులో ఎంతకాలం ఉంటావు? ముంబై వచ్చేయ్
By: Tupaki Desk | 12 Nov 2020 10:10 AMఐపీఎల్ 2020 ముగిసింది. ఎన్నో ఆసక్తికర పరిణామాలతో నిమిష నిమిషానికి ఉత్కంఠరేపిన ఈ సీజన్ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచింది. చివరకు అందరూ ఊహించనట్టుగానే బలమైన ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ప్రారంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన ముంబై.. ఫైనల్లో సైతం పట్టు నిలుపుకున్నది. అద్భుత విజయాన్నందుకున్న రోహిత్ సేనకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ఆఫ్రికా ధిగ్గజం ఏబీ డివిలియర్స్ ఈ సందర్భంగా రోహిత్ సేనను అభినందించారు. ‘వెల్‌డన్ ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది బెస్ట్ టీమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు'అని ట్రోఫీ అందిస్తున్న ఐపీఎల్ వీడియో ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.
అయితే డివిలియర్స్ ట్వీట్‌పై ఐపీఎల్ అభిమానులు భిన్నంగా స్పందించారు. ‘ ఏబీడీ.. నువ్వు విరాట్ కోహ్లీతో ఆడితే ఎప్పటికీ టైటిల్ గెలవలేవని, వెంటనే ఆ జట్టు నుంచి వచ్చేయ్. రాబోయే సీజన్‌లోనైనా కొత్త టీమ్‌ను ఎంచుకో’ అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.‘డివిలియర్స్ ముంబై ఇండియన్స్ వచ్చేయాలి’ అంటూ మరో అభిమాని కామెంట్ పెట్టాడు. క్రికెట్ లో ఏబీడి కింగ్ అని, అతను ఆర్‌సీబీని వీడాలని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి డివిలియర్స్ ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే అతడి ఆడిన జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు.
ప్రతిసారి ఈ ఏడాది బెంగళూరుకు కప్పు పక్కా అని అభిమానులు అనుకోవడం.. ఆ తరువాత బెంగళూరు వరుస ఓటములతో డీలా పడిపోవడం జరుగుతోంది. ప్రారంభంలో ఢిల్లీకి ఆడిన ఈ సౌతాఫ్రికా దిగ్గజం.. 2011 నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనే సక్సెస్ ఫుల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు కూడా ఏబీడీనే. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన డివిలియర్స్.. ఈ సీజన్ లో సూపర్ ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీడీ.. 158.74 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.