Begin typing your search above and press return to search.
జగన్ మూడు అంటే.. సోము పదమూడు అంటున్నారే
By: Tupaki Desk | 28 July 2020 5:47 PM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఏపీ శాఖ చీఫ్ గా కన్నా లక్ష్మీనారాయణను తొలగించి ఆ స్థానంలో కొత్తగా నియమితులైన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చారని చెప్పక తప్ప.దు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ... అమరావతి రాజధానిని కేవలం శాసన రాజధానికి మాత్రమే పరిమితం చేసి అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ మూడు రాజధానుల ఫార్మ్యూలాను తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ వాదనను బీజేపీ ఏపీ శాఖ నిన్నటిదాకా వ్యతిరేకిస్తూ రాగా... తాజాగా ఏపీకి మూదు రాజధానులు కాదు... ఏకంగా 13 రాజధానులు కావాలంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే.. జగన్ మూడు రాజధానులు అంటే... సోము 13 రాజధానులు అంటున్నారన్న మాటేగా
ఏపీలో అధికార వికేంద్రీకరణకు తాము సానుకూలమే అంటూ ఓ వైపు బీజేపీ చెబుతూ వస్తున్నా... మొన్నటిదాకా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా మాత్రం ఏకైక రాజధానే మేలంటూ టీడీపీ వాయిస్ ను బలపరచారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి కన్నా వెన్నుదన్నుగా కూడా నిలిచారు. మొత్తంగా వైసీపీ మూడు రాజధానులు అంటే... టీడీపీ సహా బీజేపీ కూడా ఏకైక రాజధానే అని సాగింది. అయితే బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వస్తున్న సోము మాత్రం ఆది నుంచి మూడు రాజదానుల ప్రతిపాదనను స్వాగతిస్తూ వస్తున్నారు. అంటే అధికార వికేంద్రీకరణకు పార్టీ ఓటేస్తే... పార్టీ బాటలోనే సాగిన సోము మూడు రాజధానులకు సై అన్నారన్న మాట.
బీజేపీ ఏపీ చీఫ్ గా నియమితులైన సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సోము వీర్రాజు.. ఏపీకి మూడు రాజదానులు, అధికార వికేంద్రీకరణ, రాజధాని రైతుల పోరాటంపై తనదైన రీతిలో స్పందించారు. ఏపీకి మూడు రాజధానులే కాదు... ఏకంగా 13 రాజధానులు ఉండాలన్న మాటను వినిపించిన వీర్రాజు... రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం కూడా ఓ రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా కూడా తమ పార్టీ వ్యవహరిస్తుందని కూడా వీర్రాజు వ్యాఖ్యానించారు. మొత్తంగా జగన్ మూడు రాజధానుల మాటకు బీజేపీ నుంచి కూడా ఇప్పుడు సానుకూల స్పందన వచ్చిందన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది.