Begin typing your search above and press return to search.
వాళ్లు డబ్బులు కట్టేశారు.. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ప్రైవేటు ట్రావెల్స్
By: Tupaki Desk | 1 Oct 2020 4:45 AMఏపీ నుంచి తెలంగాణకు నిత్యం వందలాది బస్సుల్లో వేలాది మంది ప్రయాణించటం తెలిసిందే. క్యాలెండర్ లో రోజు మారిందంటే చాలు.. తెలంగాణ నుంచి ఏపీకి.. ఏపీ నుంచి తెలంగాణకు వేలాది మంది ప్రయాణాలు చేసేవారు. వారిలో అత్యధికులు ప్రైవేటు బస్సులు.. రైళ్లలో ట్రావెల్ చేసే వారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. అది మొదలు సెప్టెంబరు 2 వరకు బస్సు సర్వీసులు లేకపోవటం తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత.. సెప్టెంబరు రెండు తర్వాత నుంచి నామ మాత్రంగా బస్సుల్ని తిప్పుతున్నారు.
యాభై బస్సులతో మొదలైన ఈ ప్రయాణం.. ఇప్పుడిప్పుడు కాస్త పెరుగుతున్నాయి. తాజాగా అక్టోబరు నుంచి డిసెంబరు మూడు నెలల కాలానికి సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున పన్ను కట్టేశారు.దీంతో.. ఏపీ - తెలంగాణ మధ్య ప్రైవేటు బస్సు సర్వీసులు భారీ ఎత్తున పెరగనున్నట్లుగా చెప్పాలి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం 300 బస్సులు తిరుగుతుంటే.. ఈ నెల నుంచి 800లకు పైగా బస్సులు తిరగనున్నాయి.
ఈ నెలలో వచ్చే దసరా.. తర్వాత దీపావళి.. ఆ తర్వాత వచ్చే క్రిస్ మస్ నేపథ్యంలో పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు రవాణా శాఖకు పన్ను చెల్లింపుల్ని పూర్తి చేశారు ప్రైవేటు ట్రావెల్స్. ఓవైపు ఆర్టీసీ తన బస్సుల్ని ఇంకా రోడ్డు మీదకు దించకపోవటంతో.. ప్రైవేటు ట్రావెల్సే దిక్కు అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా భారీగా దెబ్బతిన్న వ్యాపారం.. రానున్న పండగ సీజన్ పుణ్యమా అని రికవరీ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఆర్నెల్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు జోరు తాజాగా పెరగనున్నాయి.