Begin typing your search above and press return to search.
వైఎస్ రాజారెడ్డి కుటుంబంతో వైఎస్ జగన్ బంధం తెంచుకున్నాడా...?
By: Tupaki Desk | 11 July 2022 1:30 PM GMTకడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి పేరు తెలియని వారు ఉండరు. ఆయన రెండు దశాబ్దాల క్రితం మరణించినా ఆయన పేరు ఇప్పటికీ అక్కడ మారుమోగుతుంది. ఇక వైఎస్ రాజారెడ్డికి అయిదుగురు కొడుకులు, ఒక ఆడపిల్ల ఉన్నారు. వీరిలో ముగ్గురు వైఎస్ జార్జిరెడ్డి, వైఎస్సార్, వైఎస్ వివేకానందరెడ్డి గతించారు. ఇలా చూసుకుంటే రాజారెడ్డి కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఇపుడు మిగిలి ఉన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ అయిదురుగు సంతానంలో తరువాత తరం వారు ఉన్నారు. వారంతా వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి చెందిన వారుగానే చూడాలి. ఇలా మూడతవరంగా ఉన్న వీరందరికీ వైఎస్ జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని చెబుతారు. ఇలా కనుక చూస్తే సొంత మనుషులు ఎవరూ జగన్ కి లేరని పులివెందులలో పెద్ద ఎత్తున చర్చ అయితే ఎపుడూ సాగుతూ ఉంటుంది. ఇక ఇపుడు చూస్తే అమ్మ విజయమ్మ కూడా కుమార్తె దగ్గరకే వెళ్ళిపోయారు అని అంటున్నారు.
ఇక వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా జగన్ తో విభేదిస్తున్నారు. జగన్ పెదనాన్న పిల్లలు కానీ మిగత వాళ్ళ పిల్లలు కానీ జగన్ తో ఎపుడూ సఖ్యతగా ఉండరంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. వీరంతా కడప గడపలో అతి పెద్ద కుటుంబం. వైఎస్ రాజారెడ్డి అన్న వ్యక్తి అక్కడ ఒక శక్తిగా మారి ఇంతమందిని పెంచి పెద్ద వాళ్ళను చేశారు.
ఆయన కన్న కలలకు రూపంగా వైఎసార్ నిలిస్తే ఆయనకు అండగా వైఎస్ వివేకానందరెడ్డి నిలిచారు. మిగిలిన కుటుంబ సభ్యులు అంతా కూడా వెన్ను దన్నుగా ఉన్నారు. నిజానికి వైఎస్సార్ ఉన్న రోజుల్లో అయితే కుటుంబం అంటే ఉమ్మడిగా ఉండేదని చెబుతారు. అంతా ఒక్క చోట చేరి పండుగలా గడిపేవారు అని అంటారు. వారికి ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు అంటే వైఎస్సార్ సహా అందరికీ ప్రేమ. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.
ఇక వైఎస్ రాజారెడ్డి 1998 మే లో దారుణ హత్యకు గురి అయ్యారు. ఆయన హత్యకు గురి కాక ముందు వరకూ పులివెందులలో అంతా తానే అయి వ్యవహరించేవారు. ఆయన మాట వైఎస్సార్ సహా అంతా పాటించేవారు. అంతా ఒక మాట మీద త్రాటిమీద ఉండేవారు. ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక వివేకాకే మొత్తం పులివెందుల బాధ్యతలు అప్పగించారు. పులివెందుల అంటే వివేకా అన్నట్లుగా ఉండేది. ఇలా అన్నదమ్ములు ఇద్దరూ మిగిలిన సోదరులతో కలసి అంతా ఒక్క బాటగా మెలిగేవారు.
వైఎస్సార్ ని చూసిన వారు అంతా ఆయన నిండు ప్రేమను పంచుతారు అని అంటారు. ఆయన స్నేహ శీలి. ఒకసారి ఎవరితోనైనా స్నేహం చేస్తే లైఫ్ లాంగ్ వదిలే వారు కాదు. ఇక ఆయన బంధువులు, తోడబుట్టిన వారు అంటే ఎంతో మమకారం చూపించేవారు. అలాంటి వైఎస్సార్ వారసుడిగా జగన్ నుంచి కూడా అంతే ప్రేమాభిమానాలను అంతా ఆశిస్తారు అంటారు.
కానీ జగన్ ఆలోచనలు చాలా వేరేగా ఉంటాయని చెబుతారు. ఆయన వైఎస్సార్ రాజకీయ వారసత్వాన్ని స్వీకరించి సీఎం కాగలిగారు కానీ ఆయన కుటుంబ వారసత్వాన్ని స్వీకరించాలా లేదా అన్న దానికి బదులు అయితే పులివెందుల నుంచే వస్తుంది. వైఎస్సార్ ఉన్నపుడు ఏకమొత్తంగా అంతా ఒక్క లెక్కన ఉన్న కుటుంబం ఇపుడు వేరుగా ఉంది, ఎవరికి వారుగా ఉంది అంటే వైఎస్సార్ కుమారుడిగా జగన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు.
వైఎస్సార్ ఈ స్థాయిలో ఉండడానికి వైఎస్ రాజారెడ్డి కుటుంబంలోని అంతా కారణం అని చెబుతారు. మరి అలాంటి కుటుంబాన్ని తాను కూడా చేరదీసి వారి మంచి చెడ్డలను జగన్ చూడాల్సిన అవసరం ఉంది అంటున్నరు. కానీ జగన్ మాత్రం ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరన్న ఆరోపణలు కానీ ప్రచారం కానీ ఎందుకు వస్తున్నాన్నదే ఇక్కడ ప్రశ్న.