Begin typing your search above and press return to search.

ఢిల్లీ దూరమా.. వైరమా...?

By:  Tupaki Desk   |   13 Feb 2023 10:30 AM IST
ఢిల్లీ దూరమా.. వైరమా...?
X
నాలుగేళ్ళ పాటు సాఫీగా సాగిన స్నేహ బంధంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయా. జగన్ మోడీలది తండ్రీ కొడుకుల బంధం అని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు ఏపీ వచ్చి ఉధ్గాటించిన సందర్భం ఇంకా జనాలకు కళ్ల ముందు ఉండగానే పాత తీపి చేదు అవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి.

ఏపీలో చూస్తే జగన్ అధికారంలో ఉన్నారు. ఆయనకు అండగా కేంద్రం ఉంది అన్నది ఇపుడు నిన్నటి మాటగా మారుతోంది. కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ లో వైసీపీ సర్కార్ చేసిన అప్పులు అన్నీ బయటపెడుతోంది కేంద్రం. అలాగే ఏపీలో ఇళ్ళు కట్టడంలేదని కేంద్రం సాయం చేస్తున్నా కూడా గృహ నిర్మాణంలో వెనకబడి ఉందంటూ మోత మోగిస్తోంది.

ఇంకో వైపు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని నాటి టీడీపీ ప్రభుత్వం 70 శాతం పైగా పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏడు శాతం మాత్రమే చేసింది అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. ఇలా ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నట్లుగానే కేంద్ర మంత్రులు అయితే వరసబెట్టి మాట్లాడుతున్నారు. ఇవి ఏపీలోని తెలుగుదేశం పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి.

అదే టైం లో చూస్తే కొన్ని కీలక నిర్ణయాలు కూడా చకచకా కేంద్రం తీసుకుంటోంది. హై కోర్టు లో కేంద్రం అఫిడవిట్ వేసినపుడు రాజధని రాష్ట్రాల ఇష్టమని చెప్పినట్లుగా ప్రచారం సాగింది. ఇపుడు కేంద్రం పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం చూస్తే అమరావతి విభజన చట్టం ప్రకారం ఏర్పడిన రాజధాని అంటూ స్పష్టం చేసింది. ఇదే విషయం మీద సుప్రీం కోర్టులోనూ అఫిడవిట్ వేసింది.

ఇవి ఇలా ఉండగానే ఇపుడు ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించింది. గత గవరనర్ బిశ్వభూషన్ హరిచందన్ వైసీపీతో సఖ్యతగా ఉంటూ వచ్చారు. కానీ ప్రస్తుత గగవర్నర్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. పైగా నిక్కచ్చి మనిషి అని అంటున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ వైసీపీకి కళ్లెం వేసేలాగానే నిర్ణయం తీసుకుందా అన్న చర్చ సాగుతోంది.

ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అనుకుంటున్నా కేంద్రం పడనీయడం లేదు అని అంటున్నారు. ఒక వేళ డేరింగ్ చేసి అసెంబ్లీని రద్దు చేసినా రాష్ట్రపతిపాలన పెట్టి మొత్తం పరిస్థితిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికే కొత్త గవర్నర్ ని నియమించారు అని అంటున్నారు. ఏపీలో ఆర్ధికంగా సంక్షోభం ఉందని విపక్షాలు ఆరోపైస్తున్నాయి. దానికి తగినట్లుగా అప్పులో మోత పెరిగిపోతోంది.

ఇక కొత్త గవర్నర్ ఆ విషయాల మీద దృష్టి పెడతారు అని అంటున్నారు. ఒక విధంగా కొత్త గవర్నర్ క్రియాశీలం కానున్నారు అని అంటున్నారు. ఇంతే కాదు కేంద్రం ఇంకా అనేక రకాలుగా ఝలక్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కూడా సంచనల విషయాలు ఉంటాయని అంటున్నారు. అలాగే జగన్ మీద సీబీఐ కేసులలో కూడా జోరు పెరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ పొలిటికల్ స్టాండ్ మారిందని అనంటున్నారు.

ఏపీలో బీజేపీ రాజకీయ నిర్ణయాలు ముందు ముందు వేరుగా ఉంటాయని చెబుతున్నారు. బీజేపీలో కూడా నాయకత్వం మార్పు ఉంటుందని, అదే విధంగా జనసేన బీజేపీ తమ పొత్తును కొనసాగిస్తూనే తెలుగుదేశంతో చివరి నిముషంలో పొత్తులకు వెళ్తారని, అయితే అధికార వాటాను కోరుకుంటారని అంటున్నారు. బీజేపీ తనకు అండగా ఉంటే పవన్ కూడా తెలుగుదేశాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తారు అని అంటున్నారు. ఇలా వైసీపీని ఒక వైపు మరో వైపు తెలుగుదేశాన్ని కట్టడి చేస్తూ జనసేనను తమ పక్కన ఉంచుకోవడానికి బీజేపీ అతి పెద్ద రాజకీయ మంత్రాన్నే పఠిస్తోంది అని అంటున్నారు.

రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు జగన్ ఢిల్లీ టూర్లు ఇక మీదట తగ్గుతాయా అన్న దాని మీదనే ఒక అంచనాకు రావచ్చు అని అంటున్నారు. అదే టైం లో కేంద్ర పెద్దలు రానున్న రోజుల్లో ఏపీకి వచ్చి ఏమి మాట్లాడుతారు అన్న దాంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అని అంటున్నారు.