Begin typing your search above and press return to search.

అంబేద్క‌ర్‌కు జ‌రిగిన అవ‌మాన‌మే నాకు జ‌రుగుతోంది: ఏపీ డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   22 Oct 2022 2:49 PM GMT
అంబేద్క‌ర్‌కు జ‌రిగిన అవ‌మాన‌మే నాకు జ‌రుగుతోంది:  ఏపీ డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఈయ‌న‌.. జ‌గ‌న్ అంటే అప‌రిమితమైన భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. జ‌గ‌న్‌ను దేవుడు అంటారు. ఆయ‌న పేరును త‌న మ‌న‌వ‌డికి సైతం పెట్టుకున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. జ‌గ‌న్.. ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఫొటోల‌తో కూడిన ఉంగ‌రాలు చేయించుకుని మ‌రీ చేతికి ధ‌రించిన నాయ‌కుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ‌హుశ అందుకే.. ఏమో.. తెలియ‌దు కానీ.. తొలి, మ‌లి.. జ‌గ‌న్ కేబినెట్ ల‌లో ఆయ‌న స్థానం చెక్కు చెద‌ర‌లేదు. అప్పుడు.. ఇప్పుడు కూడా.. ఆయ‌న డిప్యూటీ సీఎంగానే కొన‌సాగుతున్నారు.

అయితే.. కొన్నాళ్లుగా ఈయ‌న తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. రెడ్లు త‌మ‌ను అణ‌గ‌దొక్కుతున్నార‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. ``రెడ్లంటే గౌర‌వం ఉంది. కానీ, మేం కూడా మ‌నుషుల‌మే. మేం కూడా ప్ర‌జ‌లు ఓట్లేస్తేనే గెలిచినం. మ‌మ్మ‌ల్ని కూడా ప‌ట్టించుకోండ‌బ్బా`` అని ఒక సంద‌ర్భంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. త‌ర్వాత‌.. మ‌రో సంద‌ర్భంలోనూ.. ఎస్సీల‌కు జ‌గ‌న్ ఇస్తున్న ప్రాధాన్యం.. ఇతర నాయ‌కులు ఇవ్వ‌లేద‌ని వ్యాఖ్యానించి.. మ‌రోసారి ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రోసారి డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి రోడ్డున ప‌డ్డారు. ఏకంగా.. త‌న‌ను తాను అంబేద్క‌ర్‌తో పోల్చుకుని.. ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయ‌మే త‌న‌కు కూడా జ‌రిగింద‌న్నారు.

స్వామి సొంత నియోజకవర్గం గంగాధ‌ర నెల్లూరు వైసీపీలో తాజాగా లుకలుకలు బయటపడ్డాయి. పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో తనకు అవమానం జరిగిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత సమావేశంలో తాను వస్తానని తెలుసుకొని, భేటీని 10 నిమిషాలకే వైసీపీ నేతలు ముగించుకున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలందరికీ పదవులు ఇచ్చి సహాయం చేశానని నారాయణ స్వామి అన్నారు. ఆఖరికి తననే ఎందుకు విమర్శిస్తున్నారో అర్దం కావ‌డం లేద‌ని.. ఇది త‌న‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని అన్నారు.

అంబేద్కర్ జరిగిన అవమానమే, తనకు జరుగుతున్నదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన చెందారు. పెనుమూరు మండలంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు బీఫారం ఇచ్చి, అధికారం కట్టబెడితే విమర్శిస్తారా అంటూ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌ద‌ల‌న‌ని.. పార్టీలో్ జ‌రుగుతున్న అవ‌మానాలు భ‌రించే శ‌క్తి, ఓపిక కూడా త‌న‌కు లేవ‌నివ్యాఖ్యానించారు. దీనివెనుక ఎవ‌రున్నారో.. త్వ‌ర‌లోనే బ‌య‌ట పెడ‌తాన‌ని వ్యాఖ్యానించారు. అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న‌న్న దృష్టికి కూడా తీసుకువెళ్తాన‌ని చెప్పారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.