Begin typing your search above and press return to search.
అంతా ఊహించినట్టే.. అలాగే ఏపీ కొత్త గవర్నర్ కీలక ప్రసంగం!
By: Tupaki Desk | 14 March 2023 1:00 PM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 14న ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఏపీకి కొత్త గవర్నర్ గా వచ్చిన అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం పది గంటలకు ప్రసంగించారు. ఆయన ఇటీవలే ఏపీకి గవర్నర్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అయ్యాక ఆయనకు ఇదే తొలి అధికారిక కార్యక్రమం కావడం గమనార్హం. కాగా ప్రసంగానికి ముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ కు సీఎం జగన్, మంత్రులు, శాసససభ్యులు, స్పీకర్ తమ్మినేని సీతారం, తదితరులు స్వాగతం పలికారు.
కాగా కొత్త గవర్నర్ ప్రసంగం అంతా ఊహించినట్టే జరిగింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని అభినందించారు. ముఖ్యంగా నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నవరత్న పథకాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందుతోందని వివరించారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని అభినందించారు.
రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. అలాగే ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారన్నారు. అదేవిధంగా జడ్పీ ఛైర్మన్ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. అలాగే 137 కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించామన్నారు. ముఖ్యంగా 15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుందని గవర్నర్ గుర్తు చేశారు.
ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోందన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్లో ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు వచ్చాయన్నారు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉందన్నారు. అలాగే మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఇక పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.
వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు ఇచ్చామని గవర్నర్ నజీర్ తెలిపారు. అలాగే ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక అందిస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు అందిస్తామని తెలిపారు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశామన్నారు. నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ చేశామన్నారు.అలాగే జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు ఇచ్చామన్నారు. కాగా వైఎస్సార్ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశామని గవర్నర్ తెలిపారు.
విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్ గుర్తించామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్ల ప్రభుత్వం పంపిణీ చేసిందని గవర్నర్ చెప్పారు. జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందిచామన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని వివరించారు. గోరుముద్ద పథకంతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందన్నారు. ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనని తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో తెలిపారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. కడపలో డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీని స్థాపించామన్నారు. అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం చేశామన్నారు. ఈ పథకం కింద 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం ప్రభుత్వం చేసిందన్నారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేరుస్తోందని గవర్నర్ తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని వెల్లడించారు. 11.43 శాతం గ్రోత్ రేటును సాధించామని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు చేపట్టామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.