Begin typing your search above and press return to search.

ఆ విలేకరులు వ్యభిచార గృహాల్లో బ్రోకర్ల కంటే హీనం.. కాపు ఫైర్

By:  Tupaki Desk   |   27 Jun 2023 11:00 AM GMT
ఆ విలేకరులు వ్యభిచార గృహాల్లో బ్రోకర్ల కంటే హీనం.. కాపు ఫైర్
X
ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి కోపం కట్టలు తెగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పచ్చ చానళ్లలో పని చేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని.. అలాంటి వారు చానళ్ల నుంచి బయటకు వచ్చి బొండాలు అమ్ముకోవాలన్నారు. అలా చేసినా.. కాస్తంత మర్యాద దక్కుతుందన్నారు.

తాజాగా ఆయన తన నియోజకవర్గం పరిధిలోని బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలినట్లుగా వార్తలు వచ్చాయి.

దీని పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరు గ్రామంలో వంద ఇళ్లు ఉన్నాయని.. అందులో 11 ఇళ్లు మాత్రమే తలుపులు వేసి ఉన్నాయని చెప్పారు.

గ్రామంలోని వారు వ్యవసాయ పనుల్లో భాగంగా ఇళ్లకు తాళం వేసి బయటకు వెళితే.. దాన్ని తప్పుగా వార్తలు రాశారన్నారు. అయితే.. అలా పనుల మీద బయటకు వెళ్లిన వారిని తర్వాత కలిసి ఫోటోలు తీయించుకున్నామని.. ఓర్వ లేక ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాసినట్లుగా పేర్కొంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తనకు అపూర్వమైనమద్దతులభిస్తోందని.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. కానీ.. దీన్ని ఓర్వలేని వారు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి.