Begin typing your search above and press return to search.
ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలానే ఉంటారట.. ఏపీ హోం మంత్రి ఉవాచ
By: Tupaki Desk | 25 May 2022 11:59 AM GMTఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి? పోలీసు స్టేషన్‌కు వచ్చినవారి పరిస్థితిని ఒకింత సహనంతో తెలుసుకు ని.. బాధితులకు న్యాయం చేయడం.. వారిలో భరోసా నింపడం.. అంతేకదా!.. అయిన దానికి, కాని దానికి.. బాధితులను కూడా నేరస్తుల మాదిరిగా చూడమని కాదు కదా!! ఇది కదా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. అయితే.. ఇప్పుడు ఏపీ హోం మంత్రి వనిత.. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కొత్త అర్ధం చెప్పారు. ``ఏం జరిగినా.. తమ ముందు.. ఎలాంటి విద్వంసాలు జరిగినా.. మంత్రి ఇల్లే తగలబెట్టినా.. చూస్తూ.. నిలబడడమే ఫ్రెండ్లీ పోలీసింగ్`` అని అర్ధం వచ్చేలా తెగేసి చెప్పారు.
అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై హోంమంత్రి తానేటి వనిత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. నిన్నటి ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిదర్శనమని తెలిపారు. అంటే.. దాడులు జరుగుతున్నా.. వారిని నిలువరించకపోవడమే.. మంత్రి ఇల్లు తగలబడుతున్నా.. చూస్తూ ఉండిపోవడమే.. ఫ్రెం డ్లీ పోలీసింగ్ అన్నమాట!!
అమలాపురం ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు నిన్న వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిదర్శనమన్నారు. అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ఆమె సమీక్ష నిర్వహించారు.
అమలాపురం విధ్వసకాండకు సంబంధించిన పుకార్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కాకుండా ఇంటర్‌నెట్‌ను నిలిపేశామని చెప్పారు. ఆందోళనలు చెలరేగకుండా అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న హోంమంత్రి.. హింసకు పాల్పడిన 46 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
కోనసీమ జిల్లా అమలాపురం మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. మరి ఇంత జరుగుతుంటే..వాటిని నిలువరించి.. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన పోలీసులు.. ఇలా.. చేతులు కట్టుకుని ఎవరో తమను ఆదేశించినట్టు నిలబడిపోవడం కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే.. ఇక, రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించినట్టేనని అంటున్నారు విపక్ష నాయకులు. మరిదీనికి మంత్రి వనితమ్మ ఏం సమాధానం చెబుతారో చూడాలి.