Begin typing your search above and press return to search.
ఏపీలో ఇలాంటి పోలీస్ అధికారి కూడా ఉన్నాడండి
By: Tupaki Desk | 14 Sep 2022 4:05 AM GMTపోలీసులు అన్నంతనే ఒకలాంటి సందేహం సర్వ సాధారణం. అందునా ఏపీ పోలీసులు అన్నంతనే పాజిటివ్ కంటే నెగిటివ్ భావన ఎక్కువన్న సంగతి తెలిసిందే. అలాంటి ఫీలింగ్ ను పోగొట్టే ఉదంతం ఒకటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నిత్యం ఏదో ఒక ఆరోపణలు.. విమర్శలు.. తప్పుడు పనులకు అండగా నిలిచారన్న తిట్లు.. శాపనార్థాలు వినిపించే వేళలో..అందుకు భిన్నంగా మానవత్వంతో వ్యవహరించిన ఎస్ఐ.. ఆయన సిబ్బందిని పలువురు పొగిడేస్తున్నారు. ఎందుకిలా? వారేం చేశారు? అన్నది చూస్తే..
హిందీ మాత్రమే తెలిసిన ఇద్దరు చిన్నారులు గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఏడుస్తూ తిరుగుతున్నారు. వారిని చూసిన వారంతా తమకెందుకులే అని పట్టించుకోలేదు. ఇలాంటివేళలో.. విధుల నిమిత్తం రైల్వే స్టేషన్ సమీపానికి వెళ్లిన గూడూరు వన్ టౌన్ ఎస్ఐ పవన్ కుమార్ కంటికి ఆ ఇద్దరు చిన్నారులు కనిపించారు. వెంటనే ఆగిన ఆయన.. చిన్నారుల వద్దకు వెళ్లి.. వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాత్రి వేళలో.. ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తున్న ఆ చిన్నారుల వద్దకు వెళ్లారు.
అప్పటికే భయంతో ఉన్న వారిద్దరూ ఏడుస్తుండటంతో.. ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది చేత ఫుడ్ తెప్పించి వారికి స్వయంగా తినిపించటంతో పాటు.. వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మిగిలిన సిబ్బంది సైతం సాయంగా నిలిచారు. వారెవరూ అన్న విషయాన్ని తెలుసుకనే ప్రయత్నంలో ఉత్తర భారతానికి చెందిన వారుగా గుర్తించారు. వారుఎలా తప్పిపోయారన్న విషయంపై అవగాహనకు రాలేదు.
స్టేషన్ లో వారిని ఉంచి.. కన్నబిడ్డల మాదిరి చూసుకోవటంతో పాటు.. వారు ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్లు.. బిస్కెట్లు.. సమయానికి అవసరమైనవి సమకూరుస్తూ తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తున్నారు. అదే సమయంలో.. ఈ ఇద్దరు చిన్నారులు ఎవరికి చెందిన వారై ఉంటారన్న సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.
ఇప్పటికి ఈ వెదుకులాట కొలిక్కి రాలేదు. అయితే.. ఈ విషయం స్థానిక విలేకరులకు తెలీటం.. వారు స్టేషన్ కు వెళ్లారు. పిల్లల విషయంలో స్టేషన్ ఎస్ఐ.. ఇతర పోలీసులు మానవత్వంతో స్పందిస్తున్న తీరు.. బయట ప్రపంచానికి తెలిసింది.
పిల్లల విషయంలో స్పందించిన ఎస్ఐను జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి అభినందించటంతో పాటు.. వారి తల్లిదండ్రుల్ని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వావ్ అనే ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఎస్ఐను స్టేషన్ సిబ్బందిని అభినందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.