Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధాని త్వ‌ర‌లో విశాఖ‌కు షిఫ్ట్‌: నెటిజ‌న్ల టాక్ ఇదే!

By:  Tupaki Desk   |   9 Feb 2023 4:17 PM GMT
ఏపీ రాజ‌ధాని త్వ‌ర‌లో విశాఖ‌కు షిఫ్ట్‌:  నెటిజ‌న్ల టాక్ ఇదే!
X
కొన్ని రోజుల కింద‌ట ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీలో నిర్వ‌హించిన ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల స‌న్నాహ‌క స‌ద స్సులో మాట్లాడుతూ.. పాల‌నా రాజ‌ధానిగా విశాఖ త్వ‌ర‌లోనే ఆవిర్భవిస్తుంద‌ని చెప్పారు. తాను కూడా త్వ రలోనే విశాఖ‌కు షిఫ్ట్ అయిపోతాన‌ని కూడా చెప్పారు. ఇది స‌హ‌జంగానే ఏపీలో రాజ‌కీయాల‌ను వేడెక్కిం చింది. ఆ వెంట‌నే స్పందించిన టీడీపీ నేత‌లు.. అస‌లు దీనిని తేల్చేసుకుందాం.. అన్న‌ట్టుగా పార్ల‌మెం టు వేదిక‌గా.. దీనిని ప్ర‌స్తావించారు.

సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లను ఎంపీ క‌న‌క మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ప్ర‌శ్నించారు. విశాఖ‌ను రాజ‌ధానిగా గుర్తిస్తున్నారా? అని అడిగారు. దీనికి కేంద్రం అస‌లు త‌మ‌కు తెలియ‌ద‌ని.. తాము అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. అయినా.. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని వ్య‌వ‌హారం కోర్టుల్లో ఉన్నందున దీనిపై ఎక్కువ‌గా మాట్లాడ లేమ‌ని కూడా స్ఫ‌ష్టం చేసేసింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టుగా.. విశాఖ రాజ‌ధాని అయ్యే అవ‌కాశం ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు.

మరోవైపు.. మాజీ మంత్రి కొడాలి నాని.. ఇప్పుడు కాక‌పోయినా ఫ‌ర్వాలేదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 ఎంపీ స్థానా ల‌ను ద‌క్కించుకుని పార్ల‌మెంటులోనే మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా చ‌ట్టం చేయించుకుని అప్పుడైనా వెళ్లిపోతామ‌ని చెప్పుకొచ్చారు.

ఈ ప‌రిణామాల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. 'ఏపీ రాజ‌ధాని త్వ‌ర‌లో విశాఖ‌కు షిఫ్ట్‌' అనే బోర్డు త‌గిలించుకోండి! అని కొంద‌రు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అదేస మయంలో మ‌రికొంద‌రు.. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఎవ‌రూ చెరిపేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు.

దీనికి ఇటీవ‌ల వైసీపీ నాయ‌కుడు ఒక‌రు చంద్ర‌బాబుతోక‌లిసి ప్ర‌యాణం చేసిన సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా జోడించారు. చంద్ర‌బాబు వ‌స్తేనే ఏపీ అభివృద్ధి అనే నినాదాన్ని ఎక్కువ మంది నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. అదేవిధంగా బాబు విజ‌న్.. ముందు.. జ‌గ‌న్ తేలిపోతున్నార‌నే వారు కూడా క‌నిపిస్తున్నారు.

ఇలా.. మొత్తంగా చూస్తే. విశాఖ రాజ‌ధానిపై నెటిజ‌న్లు అనేక రూపాల్లో స్పందిస్తున్నారు. ఇవ‌న్నీ కూడా.. వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎవ‌రూ కూడా పెద‌వి విప్పి బ‌య‌ట‌కు ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.