Begin typing your search above and press return to search.
బొత్సను పోటీ చేయొద్దంటున్నదెవరు...?
By: Tupaki Desk | 7 May 2023 10:25 AM GMTవిజయంగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను ఈసారి ఎంపీగా పంపించేయండి అని వైసీపీలో ఒక వర్గం పట్టుపడుతోందా అంటే ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతోంది. బొత్సను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఏముంది వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనే మళ్లీ మంత్రి అవుతారు అన్నదే తోటి నాయకుల భావన అని అంటున్నారు.
బొత్స విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు అని అంటున్నారు. ఆయనను పక్కన పెట్టి వైసీపీ హై కమాండ్ రాజకీయం చేయడం కష్టమే అంటున్నారు. మరో వైపు చూస్తే బొత్స కూడా పార్టీ అధినాయకత్వం పట్ల విధేయతతో మెలుగుతున్నారు. ఒకనాడు తాను ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశాను అని కానీ ముఖ్యమంత్రి రేసులో చివరి దాకా వెళ్ళి వచ్చాను అని కానీ ఆయన తలవడంలేదు.
ఆయన గతంలో చెప్పినట్లుగా వైసీపీలోకి వచ్చినపుడే పది మెట్లు దిగి వచ్చాను అని ఇపుడు సర్దుకుపోతున్నాను అని అంటున్నారు ప్రాంతీయ పార్టీల తీరు వేరుగా ఉంటుందని, దానికి తగినట్లుగా అడ్జస్ట్ కావడమే అని బొత్స అంటున్నారు. ఇక ఆయన ఎమ్మెల్యేగానే మరోసారి చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో హై కమాండ్ కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
నిజానికి మొదట బొత్స తన కుమారుడు బొత్స సందీప్ ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు కానీ జగన్ సీనియర్లు పోటీకి దిగాల్సిందే అన్న మాటతో తానే రంగంలోకి వస్తున్నారు. ఇక బొత్సకు మరో కోరిక ఉంది. ఈసారి తన భార్య మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా విజయనగరం నుంచి బరిలోకి దింపాలన్నదే ఆ కోరిక. దానికి వైసీపీ కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు
ఇలా బొత్స హై కమాండ్ మధ్యన మంచి గానే రిలేషన్స్ ఉన్నాయి. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు బొత్స ఉంటే తమకు మినిస్టర్ పోస్ట్ దక్కదని ఆయన్ని ఎంపీగా పంపించమంటున్నారు అని తెలుస్తోంది. అయితే బలమైన తూర్పు సామాజిక వర్గానికి చెందిన బొత్సను తప్పించడం అంటే అసలు కుదిరే పని కాదని అంటున్నారు.
ఇక బొత్స బంధువులు సన్నిహితులకు టికెట్లు ఈసారి కూడా ఎక్కువగానే లభిస్తాయా అంటే హై కమాండ్ ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేసినా గెలుపు అవకాశాలనే చూస్తుంది తప్ప ఎవరి బంధువు అని చూడదని బొత్స అంటున్నారు. అంటే గెలుపు గుర్రాలే తన బంధు వర్గంలో ఉన్నారని బొత్స చెప్పకనే చెబుతున్నారు అన్న మాట. ఇవన్నీ చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో బొత్స సకుటుంబ సపరివారంగా ఎన్నికలకు రెడీ అవుతున్నట్లే లెక్క అంటున్నారు. బొత్స ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ మళ్లీ పవర్ లోకి వస్తే మాత్రం కోలగట్ల వీరభద్రస్వామి లాంటి వారి మంత్రి ఆశలు ఇక జీవిత కాలం అయినా నెరవేరవు అనే అంటున్నారు.