Begin typing your search above and press return to search.
ఆరోగ్య శ్రీ పేరు ఇక టీఆర్‌ఎస్
By: Tupaki Desk | 20 Feb 2016 7:56 AM GMTప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారడం సహజమే... తమతమ పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లు పెట్టి ఆ పథకాలను రీడిజైన్ చేస్తుంటారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రాజీవ్ - ఇందిర - నెహ్రూ వంటిపేర్లతో పథకాలు ఉంటాయి.... ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజపేయి - శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి నేతల పేర్లు పెడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉంటే ఆ నేతల పేర్లు... టీడీపీ అయితే ఎన్టీఆర్ పేరు పెడుతుంది. అయితే... తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆరెస్ పార్టీ మాత్రం వీరందరికంటే ఒక అడుగు ఇంకా ముందుకేసింది. తక్కువ చరిత్ర ఉన్న పార్టీ కావడం... అధికారం చేపట్టడం తొలిసారే కావడం... పార్టీలో అత్యంత గొప్ప వ్యక్తి అయిన కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండడంతో పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టుకోవడానికి టీఆర్ ఎస్ కు అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆ పార్టీ భలే ఎత్తుగడ వేసింది.
బాగా పాపులర్ అయిన ఆరోగ్య శ్రీ పథకానికి... "తెలంగాణ రాష్ట్ర స్వస్థ కార్డు" అని పేరు మారుస్తున్నారు. దీని సంక్షిప్త నామం ఆటోమేటిగ్గా "టీఆర్ ఎస్" అనే వచ్చేలా ఈ పేరు రూపొందించారు. దేశ చరిత్రలోనే ఇలా ఒక పథకానికి పార్టీ పేరు పెట్టుకోవడం ఎక్కడా లేదని అంటున్నారు. ఇంకొద్ది రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు తొలగించి వాటి స్థానంలో గులాబీ రంగులో ఉండే టీఆరెస్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
నిరుపేదలు ప్రభుత్వ - ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్య శ్రీని ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2007లో మహబూబ్ నగర్ జిల్లాలో దీన్ని ప్రారంభించారు. స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. రాజశేఖరరెడ్డిని హీరోను చేసిన పథకాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం దీని పేరు మార్చబోతున్న నేపథ్యంలో రాజశేఖరరెడ్డి కుమారుడు, వైసీపీ అధినేత, కేసీఆర్ మిత్రుడు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.