Begin typing your search above and press return to search.

నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

By:  Tupaki Desk   |   7 July 2023 5:39 PM GMT
నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!
X
వివాదాస్పద స్వయం ప్రకటిత స్వామీ నిత్యానంద భారతదేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. వీలైనన్ని వివాదాల్లో చిక్కుకుని దేశం నుంచి పరాయై ఓ ఐలాండ్ ను కొని దాన్నే తన దేశం అని ప్రకటించుకున్న సంగతీ తెలిసిందే. ఈ సమయం లో మరోసారి తన సేవకురాలు, మాజీ నటి రంజిత కు కీలక బాధ్యతలు అప్పగించారనే విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది.

అవును... నిత్యానంద కు ప్రియ శిష్యురాలి గా పేరొంది వివాదాల్లో చిక్కుకున్న నటి రంజిత ఇప్పుడు నిత్యానంద స్వయం ప్రకటిత దేశం కైలాస కు ప్రధాని అయ్యింద ని తెలుస్తుంది. ఈ మేరకు ఒక ప్రముఖ తమిళ దినపత్రిక ఈ విషయాల ను వెళ్లడించింది. "కైలాస దేశం" మాజీ నటి రంజిత ను ప్రధానమంత్రిగా ప్రకటించిందని పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రచురించింది.

దీంతో "నిత్యానందమయి", అలియాస్ అలనాటి హీరోయిన్ రంజిత... నిత్యానంద స్వామికి చేసిన "సేవ"లకు ఫలితంగా ఈ ప్రధాని పదవి దక్కినట్లు తెలుస్తొంది. దీంతో కైలాస దేశాని కి తొలి మహిళా ప్రధాని అయి రంజిత చరిత్ర సృష్టించార ని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇందులో భాగంగా నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానంద - రంజిత ఫొటోలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. ఆ స్థాయి లో అతనికి రంజిత అత్యంత ప్రియ శిష్యురాలిగా మారార ని అంటున్నారు. మొదట్లో ఈ మాజీ నటి తనని తాను "నిత్యానందమయి" అని ప్రకటించుకుంది. కాగా... నటిగా రంజిత.. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ఎంతో మంది అభిమానుల కు సొంత చేసుకుంది.

ఇలా ఫుల్ సినిమాల తో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే నిత్యానంద చెంత కు చేరింది. అతి తక్కువ కాలంలోనే ఆయనకు ప్రియ శిష్యురాలు అయ్యింది. అనంతరం ఒక వీడియో వెలుగు లోకి రావడం తో... వ్యవహారం వివాదాస్పదమైంది.

కాగా ఇటీవల కౌలాస దేశం తరపున ఐక్యరాజ్య సమితి సమావేశం లో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమావేశం లో కైలాస దేశ రాయబారిగా వచ్చిన ప్రియా నిత్యానంద మాట్లాడుతు భారతదేశం నిత్యానంద ను వేధిస్తోంది అంటూ ఆరోపించారు కూడా. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఆమె ఆరోపణలను పరిగణ లోకి తీసుకోలేదు. ఇదే సమయంలో కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చినట్లుగా ఎక్కడా లేదని తెలుస్తోంది.