Begin typing your search above and press return to search.

అశోక్ కూతురు పొలిటిక‌ల్ జ‌ర్నీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే ?

By:  Tupaki Desk   |   19 Sep 2021 2:30 PM GMT
అశోక్ కూతురు పొలిటిక‌ల్ జ‌ర్నీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే ?
X
విజ‌య‌న‌గ‌రం జ‌మిందార్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయ ఆశ‌లు అన్నీ ఇప్పుడు ఆయ‌న కుమార్తె అతిథి మీదే ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు తండ్రి చాటు బిడ్డ‌గానే ఉన్న ఆమె గ‌త ఎన్నిక‌ల్లోనే తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌బ‌రిలోకి దిగారు. విచిత్రం ఏంటంటే ఆమె విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యేగా కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చేతిలో 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఆ సెగ్మెంట్ ప‌రిధిలోనే ఎంపీగా పోటీ చేసిన అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు 27 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. క్రాస్ ఓటింగ్ దెబ్బ‌తో అతిథి ఓడిపోక త‌ప్ప‌లేదు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆమె ఆ త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు డివిజ‌న్ల‌లో బాగా ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.

అయితే తండ్రిలాగానే ఆమె కూడా సౌమ్యురాలు కావ‌డం మైన‌స్‌గా మారింది. అశోక్ సోద‌రుడి కుమార్తె సంచ‌యిత‌లో ఉన్నంద దూకుడు అతిథిలో లేద‌నే అంటారు. సంచ‌యిత దూకుడు రాజ‌కీయాల్లో ముందు ఉన్నారు. పైగా ఆమెకు బ‌ల‌మైన వాయిస్ కూడా ఉంది. బీజేపీలో చేరిన ఆమె మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి పొంద‌డం కూడా మామూలు విష‌యం కాదు. అప్ప‌ట్లో ఆమె త‌న‌పై వ‌చ్చిన ప్ర‌తి విమ‌ర్శ‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చేవారు. అయితే స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో రాణించాలంటే ఇంత స్లోగా ఉంటే కుద‌ర‌దు అన్న విష‌యం తెలిసిందే.

విచిత్రం ఏంటంటే అశోక్‌ను సంచ‌యిత ప‌ట్టుకుని అన్నేసి మాట‌లు అన‌డంతో పాటు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసినా కూడా అతిథి దానికి ధీటుగా కౌంట‌ర్లు ఇవ్వ‌లేక‌పోయారు. అశోక్‌ను అలా విమ‌ర్శ‌లు చేస్తుంటే టీడీపీ వాళ్ల‌తో పాటు వైసీపీ నేత‌లు కూడా ఎంతో బాధ‌ప‌డ్డారు. చివ‌ర‌కు బీజేపీ వాళ్లు కూడా అశోక్ త‌ర‌పున వ‌క‌ల్తా పుచ్చుకున్నారు. ఆమె దూకుడుగా ఉండ‌డం లేద‌న్న నివేదిక‌లు కూడా ఇప్ప‌టికే పార్టీ అధిష్టానానికి వెళ్లాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అశోక్ పోటీ చేయ‌డం అనుమాన‌మే.. !

సంచ‌యిత‌, అతిథి త‌రం స్టార్ట్ అయ్యింది. మ‌రి దూకుడుకు మారుపేరు అయిన సోద‌రి సంచ‌యిత‌ను దాటుకుని అతిథి ముందుకు వెళ్లాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. పైగా 2024 ఎన్నిక‌ల్లోనూ ఆమె మ‌ళ్లీ విజ‌య‌న‌గ‌రం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయాల్సి ఉంది. పైగా సంచ‌యిత వైసీపీలోకి వెళ్లి అతిథి మీదే పోటీ చేస్తార‌న్న టాక్ కూడా ఉంది. త‌న వంశానికి తానే అస‌లు సిస‌లు వార‌సురాలిని అని ఆమె ఫ్రూవ్ చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రి అతిథి ఏం చేస్తుందో ? చూడాలి.