Begin typing your search above and press return to search.

లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ను జీవాయుధం అన్న నటి

By:  Tupaki Desk   |   12 Jun 2021 8:00 AM IST
లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ను జీవాయుధం అన్న నటి
X
ఆరేబియా సముద్రంలో విసిరేసినట్టు ఉండే లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆయన నిర్ణయాలను లక్ష్యద్వీప్ ప్రజలు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.ఈ క్రమంలోనే లక్ష్యద్వీప్ లోని చెట్లాట్ కు చెందిన ఐషా సుల్తానా ప్రముఖ నటి, మోడల్, డైరెక్టర్ కూడా. మలయాళ సినిమాలో ఆమె పనిచేస్తుంటారు. 2020లో 'ఫ్లష్' అనే మలయాళ సినిమాకు దర్శకత్వం వహించారు.

తాజాగా లక్ష్యద్వీప్ లో పరిస్థితులపై మలయాళ న్యూస్ చానెల్ తో సుల్తానా మాట్లాడారు. కేంద్రంపైనా ప్రపూల్ పటేల్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ను 'జీవాయుధం'గా అభివర్ణించారు. దీంతో రెండు రోజులుగా ఆమె పేరు మారుమోగింది. గూగుల్ లో ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు. బీజేపీ లక్షద్వీప్ అధ్యక్షుడు సి. అబ్దుల్ ఖాదర్ హజీ సుల్తానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 'దేశద్రోహం' కేసు పెట్టారు.

ఇక తాను అడ్మినిస్ట్రేటర్ ను మాత్రమే బయో వెపన్ అన్నానని.. ప్రభుత్వాన్ని.. దేశాన్ని కానీ ఏమీ అనలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. లక్ష్యద్వీప్ లో ఇటీవల ప్రతిపాదించిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో ఐషా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై దేశద్రోహ కేసులు నమోదు చేశారు.