Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకులో ఎలన్‌ మస్క్‌..జుకర్‌ బర్గ్‌ స్థానం ఎంతంటే?

By:  Tupaki Desk   |   17 Nov 2020 2:10 PM GMT
ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకులో ఎలన్‌ మస్క్‌..జుకర్‌ బర్గ్‌ స్థానం ఎంతంటే?
X
టెస్లా సీఈఓ ఎలన్‌‌ మస్క్ .. ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. టెస్లా ఇంక్‌ షేరుకి ఎస్‌ అండ్‌ పీ-500 ఇండెక్సులో చోటు దక్కనుంది. డిసెంబర్‌ 21 నుంచి టెస్లా షేరుకి చోటు కల్పిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఎస్ ‌అండ్‌ పీ డోజోన్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. మార్కెట్లు ముగిశాక ఈ వార్త వెల్లడికావడంతో టెస్లా ఇంక్‌ షేరు ఫ్యూచర్స్‌ లో ఒకేసారి 14 శాతంపైకి ఎగబాకింది. దీనితో 408 డాలర్ల నుంచి 462 డాలర్లకు ఎగసింది. దీంతో కంపెనీలో 20 శాతం వాటా కలిగిన సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద 117.5 బిలియన్‌ డాలర్లను తాకింది దీంతో బ్లూమ్ ‌‌బర్గ్‌‌ బిలియనీర్‌‌‌‌ ఇండెక్స్‌‌ లో ఫేస్‌‌ బుక్ జుకర్‌‌‌‌ బర్గ్‌‌ ను ఎలన్‌‌ అధిగమించారు.

ప్రస్తుతం జుకర్‌‌‌‌ బర్గ్‌‌ సంపద 110.8 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టెస్లా షేర్లు ఏకంగా 500 శాతం పెరగడంతో, ఎలన్ మస్క్ సంపద 90 బిలియన్‌‌ డాలర్లు ఎగిసింది. దీనితో ఎలన్ సాంకేతికంగా ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకుకు చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ 387 బిలియన్‌ డాలర్లను తాకింది. భారీ మార్కెట్‌ విలువ కలిగిన టెస్లా ఇంక్‌ ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్సులో చేరడం ద్వారా యూఎస్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కంపెనీకున్న వెయిటేజీ రీత్యా 51 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఇతర కౌంటర్ల నుంచి టెస్లా వైపునకు మళ్లే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్ ‌అండ్‌ పీ ఇండెక్సులో చేరడం ద్వారా టెస్లా ఇంక్‌ అధికారికంగా బ్లూచిప్‌గా మారనున్నట్లు వ్యాఖ్యానించారు. ఏదైనా కంపెనీ ప్రామాణిక ఇండెక్సులో చోటు సాధించాలంటే.. కనీసం 8.2 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కలిగి ఉండాలి. అధిక లిక్విడిటీతో ప్రజల వద్ద 50 శాతం వాటా ఉండాలి.