Begin typing your search above and press return to search.

రేవంత్ కు పోటీగా కాంగ్రెస్ లో సొంత పాదయాత్రలు

By:  Tupaki Desk   |   4 March 2023 3:00 PM GMT
రేవంత్ కు పోటీగా  కాంగ్రెస్ లో సొంత పాదయాత్రలు
X
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ మొదటికొచ్చారు..! కొన్ని రోజులుగా పార్టీ నాయకులు గ్రూపు విభేదాలను పక్కనబెట్టారన్న ప్రచారం సాగింది. కానీ మరోసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూపంలో అసంతృప్తి బయటపడింది. ఓ వైపు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర నిర్వహిస్తుండగా.. ఏలేటి మహేశ్వ ర్ రెడ్డి సొంత యాత్ర నిర్వహించేందుక రెడీ అవుతున్నారు. అయితే ఆయన నిర్వహించే యాత్రకు సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు హాజరు కావడం గమనార్హం. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని నాయకులు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తరువాత నుంచి అసంతృప్తులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఓ వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. అదీ గాక గతంలో పనిచేసిన పార్టీ రాషట్్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ పార్టీని బ్రష్టు పట్టించారని కొందరు ఆరోపించారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా మహారాష్ట్రకు చెందిన మాణిక్యరావు థాక్రేను నియమించడంతో అయన సీనియర్లు, జూనియర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అసంతృప్తిని చల్లార్చారన్నారు.

రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రకు అందరూ కలిసి రావాలని థాక్రే చెప్పడంతో సరేనన్నట్లు తలూపారు. కానీ తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొంతంగా యాత్రను నిర్వహిస్తున్నానని ప్రకటించడంతో పార్టీలో కలకలం రేపింది.

అంతేకాకుండా శుక్రవారం ఆయన యాత్రను భైంసా నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్న వారంతా పాల్గొనడంతో అసంతృప్తి ఇంకా చల్లారలేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇక ఇలా ఒకే పార్టీలో రెండు యాత్రలు చేపట్టడంతో రేవంత్ ఒంటరిగానే మారుతారా? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు అంతంత మాత్రాన ఆదరణ ఉంది. ఈ నేపత్యంలో మరోసారి ఇలా నాయకులు రెండుగా విడిపోతే ప్రజలు ఎవరిని ఆదరిస్తారని చర్చించుకుంటున్నారు. అయతే మహేశ్వర్ రెడ్డితో థాక్రే చర్చలు జరిపినా ఆయన వినలేదని తెలుస్తోంది. పైగా ఆయన పాదయాత్రలో హాజరవుతారని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

బైంసా నుంచి మొదలుపెట్టిన మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర 40 నియోజకవర్గాల్లో సాగనుంది. నిర్మల్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్, నారాయణ ఖేడ్ నుంచి అందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా గాంధీ భవన్ వరకు ఉంటుందని అంటున్నారు. పాదయాత్ర ముగింపు రోజు ఇక్క బహిరంగ సభను నిర్వహిస్తారని అంటున్నారు. ఇక ఈ పాదయాత్ర సమయంలో ఆయా ప్రాంతాల్లోనీ సీనియర్లు పాల్గొంటారన్న చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.