Begin typing your search above and press return to search.

అంబటి రాయుడు మనసులో మాట!

By:  Tupaki Desk   |   27 Jun 2023 9:00 PM GMT
అంబటి రాయుడు  మనసులో మాట!
X
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన యువ క్రికెటర్ అంబటి రాయుడు కు ప్రజాసేవ చేయాలన్న కోరిక చాలానే ఉందిట. సరైన సమయంలో తన కోరిక ను బయటపెడతా ను అని అంటున్నారు. నిజానికి అంబటి రాయుడు చాలా కాలంగా చూస్తే ఆ దిశగానే తన అడుగులు వడివడిగా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పదే పదే ట్విట్టర్ ద్వారా పొగుడుతూ వచ్చారు. రెండు సార్లు ఆయన సీఎం ని స్వయంగా కలసి కీలక భేటీలు వేశారు. అంతే కాదు సీఎం పాలనా విధానాలు వికేంద్రీకరణ పాలసీల ను ఆయన బాగానే పొగుడుతూ వచ్చారు.

దాంతో అంబటి రాయుదు తాజాగా ఒక చానల్ ఇంటర్వూలో రియాక్ట్ అయ్యారు. తాను ప్రస్తుతం అందరి లోనూ తిరిగి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను అని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి అంబటి రాయుడు తధ్యం అన్న దాని మీద ఆయన సరైన సమయంలో అధికారిక ప్రకటన చేస్తాను అని అంటున్నారు.

రాజకీయంగా తన కు కోరిక ఉందని కొన్ని రోజులలో ప్రకటిస్తాను అని అంబటి చెప్పారు. ప్రజల సమస్యలను దగ్గరుండి గమనిస్తున్నారు అని అంబటి చెప్పారు. రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తే చూద్దామని ఆయన అన్నారు. వైసీపీ నుంచి పోటీ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేరు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని తాను క్రీడల కు సంబంధించి మాత్రమే కలిశాను అని అంటున్నారు. తాను అయితే ప్రస్తుతానికి ప్రజాల తో మమేకం కావడం మీదనే దృష్టి పెట్టాను అని ఆయన అన్నారు గుంటూరు ఎంపీ గా పోటీ అన్న దాని మీద కూడా అంబటి నవ్వుతూ జవాబు దాటవేశారు.

మొత్తానికి చూస్తే అంబటి గుంటూరు లోని తన సొంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు అంటే కచ్చితంగా ఆయన ఎంపీ గానో ఎమ్మెల్యే గానో పోటీకి దిగబోతున్నారు అన్నది అర్ధం అవుతోంది. అదే టైం లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ అన్నది మాత్రం బయట కు చెప్పడంలేదు. ఆయనాఇతే ఒక కీలక నిర్ణయం దిశగానే ఆలోచన చేస్తున్నారు అనంది అర్ధం అవుతోంది.

అంబటి రాయుడు ప్రజల కు సంబంధించిన సమస్యల ను సావధానంగా వింటూ వస్తున్నారు. అంబటి రాయుడు అయితే రాజకీయ అరంగేట్రం ఖాయానే చెప్పాలి. వైసీపీ తరఫున గుంటూరు ఎంపీ గా ఆయన కు అవకాశం కల్పిస్తారు అని ప్రచారంలో ఉన్న మాట. అంబటి రాయుడు వంటి బిగ్ ఫిగర్ ని ఎంపీగానే పోటీ చేయించాలని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఏది ఏమైనా ఈ యువ క్రికెటర్ తనకు ప్రజా సేవ చేయాలని ఉందని మనసు లో మాట అయితే చెప్పేశారు. ఇక చేరబోయే పార్టీ, తన రాజకీయ అరంగేట్రం మీద మంచి ముహూర్తం చూసుకుని ఆయన ప్రకటన చేయనున్నారు అని అంటున్నారు.