Begin typing your search above and press return to search.
హెచ్ 1బీ వీసాల కోసం కంపెనీల కక్కుర్తిని గుర్తించిన అమెరికా
By: Tupaki Desk | 29 April 2023 7:00 PM GMTడాలర్ డ్రీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన హెచ్1బీ వీసాను సొంతం చేసుకోవటం కోసం పడే పాట్లు అన్నిఇన్ని కావు. వీసాల జారీ విషయంలో అనుసరించే విధానాల్లోని లోపాల్ని గుర్తించి.. తమకు అనుకూలంగా మార్గాల్ని మార్చుకునే వారి మోసాల్ని అగ్రరాజ్యం అమెరికా గుర్తించింది. దీనిపై తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీసాల కోసం వినియోగించే లాటరీ వ్యవస్థను తప్పుదారి పట్టించేలా అనుసరిస్తున్న విధానాలను చెప్పేసిన అగ్రరాజ్యం.. ఇప్పుడున్న పద్దతుల్ని మార్చేస్తున్నట్లు పేర్కొంది.
అంతేకాదు.. తప్పుడు పద్దతుల్ని అనుసరిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అవసరమైన వీసా అవకాశాల్ని పెంచుకోవటానికి లాటరీ వ్యవస్థల్ని మోసగిస్తున్న వైనాన్ని గుర్తించినట్లుగా పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విధానానికి బదులుగా ఆధునీకరించేలా చర్యల్ని చేపట్టింది.
ఇప్పటి వరకు పలు కంపెనీలు తమ ఉద్యోగుల హెచ్ 1బీ వీసాల్ని దక్కించుకోవటం కోసం ఒకే వ్యక్తి పేరు మీద పలు దరఖాస్తుల్ని అప్లై చేస్తుంది. కానీ.. ఒకే దరఖాస్తుగా చెబుతుంది. ఇలా చేస్తున్న విధానాన్ని తాము గుర్తించినట్లుగా అమెరికా పౌరసత్వ.. వలస సేవల సంస్థ గుర్తించినట్లుగా పేర్కొన్నారు. 2024 సంవత్సరానికి కాను రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టగా.. గతంతో పోలిస్తే పెద్ద మొత్తంలో అప్లికేషన్లు వచ్చినట్లుగా పేర్కొంది.
ఈ ఏడాది కంప్యూటర్ జనరేటెడ్ లాటరీలో ఏకంగా 7.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2023లో ఈ సంఖ్య కేవలం 4.83 లక్షలు కావటం గమనార్హం. 2022లో 3.01 లక్షలు. 2021లో 2.74 లక్షలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో పోలిస్తే.. ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని చూస్తే.. ఒకరే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న వైనాన్ని గుర్తించారు. ఈ ఏడాది 4.08 మంది దరఖాస్తు దారులు ఒకటి కంటే ఎక్కవసార్లు లాటరీలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. గతంలో ఇలా చేసిన వారు 1.61 లక్షల మందేనని చెప్పింది.
తమ ఉద్యోగులకు వీసాలు రావాలన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు విధానాల్ని అనుసరించటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలా చేసే వారి మీద దర్యాప్తు ప్రారంభించామని.. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసుకునే వారి మీద చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతోపాటు ఇప్పుడున్న విధానాల్ని ఆధునీకరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.