Begin typing your search above and press return to search.
జగన్ డ్రీం సిటీ లో అమిత్ షా...హీటెక్కనున్న ఏపీ పాలిటిక్స్
By: Tupaki Desk | 2 Jun 2023 7:14 PM GMTకేంద్ర హోం మంత్రి బీజేపీలో సర్వం తానే అయిన అమిత్ షా చాలా కాలం తరువాత ఏపీకి వస్తున్నారు. ఆయన ఈసారి నేరుగా జగన్ డ్రీం సిటీ అయిన విశాఖలో ల్యాండ్ అవుతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిని చేయాలని జగన్ పదే పదే అంటున్నారు. ఇదే విషయం కేంద్ర పెద్దల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలసినప్డు జగన్ ఒక వేళ న్యాయపరంగా ఈ వ్యవహారం తేలకపోతే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కూడా కోరినట్లుగా ప్రచారం సాగింది.
ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఆగస్టు నాటికే జగన్ విశాఖకు తన మకాం మార్చేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో అమిత్ షా ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసారు అంటున్నారు. ఆయన ఈ నెల 8న ఏపీకి వస్తున్నారు. ఆయన విశాఖలో ఆ రోజున భారీ సభను కూడా నిర్వహిస్తారు అని అంటున్నారు.
తొమ్మిదేళ్ల పాటు కేంద్రంలో మోడీ పాలన సాగిన క్రమంలో పాలనపరంగా విజయాలను చాటి చెప్పేందుకు దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రతీ చోటా సభలూ సమావేశాలూ నిర్వహిస్తోంది. దాంతో బీజేపీ పెద్దగా అమిత్ షా విశాఖ వస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి ఈ సందర్భంగా జరిగే రాజకీయ సభలో మోడీ ఏం మాట్లాడుతారు అన్నదే చర్చగా ఉంది.
గతంలో అంటే సుమారు రెండేళ్ళ క్రితం మోడీ తిరుపతి టూర్ కి వచ్చారు. సౌతిండియా స్టేట్స్ తో మీటింగ్ నేపధ్యంలో అమిత్ షా నాడు పర్యటనకు వచ్చారు ఆ సందర్భంగా అమరావతి రాజధానికి మద్దతుగా బీజేపీ నేతలను ఉద్యమంలో పాలు పంచుకోమని కోరారు. ఆ తరువాతనే ఏపీలో బీజేపీ అమరావతికి మద్దతు అంటూ ప్రకటిస్తూ వచ్చింది.
అలా వైసీపీకి యాంటీగా ఒక పవర్ ఫుల్ డెసిషన్ నాడు తీసుకున్న అమిత్ షా ఇపుడు విశాఖలో ఏమి మాట్లాడతారు అన్నది చర్చగా ఉంది. అదే విధంగా ఏపీలో పొత్తుల వ్యవహారం కూడా ఇపుడు జోరుగా చర్చకు వస్తోంది. టీడీపీతో జనసేన వెళ్లేందుకు సుముఖంగా ఉంది. అయితే బీజేపీని తన వెంట తీసుకెళ్లాయని చూస్తోంది. బీజేపీ ఈ విషయంలో తన మనసులో ఏముందో కూడా అమిత్ షా టూర్ లో బయటపడుతుందని అంటున్నారు.
ఇక అమిత్ షా విశాఖ వస్తున్న నేపధ్యంలో జనసేన అధినేత మిత్రుడు అయిన పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. గత ఏడాది నవంబర్ లో ప్రధాని మోడీ విశాఖకు వచ్చినపుడు పవన్ని పిలిపించుకుని ఏకాంత చర్చలు జరిపారు. నాడు పవన్ కి మోడీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారన్న చర్చ సాగింది. వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీలో ఎలాంటి చర్చ సాగింది అన్న దాని మీద వివరాలు అయితే ఎవరూ చెప్పలేదు, ఊహాగానాలే కొనసాగాయి.
ఇపుడు అమిత్ షా విశాఖ టూర్ లో పవన్ కి ఆహ్వానం అందింతే మాత్రం బీజేపీ మనసులో ఏముందో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 10న తిరుపతిలో జరిగే బీజేపీ సభకు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వస్తున్నారు. ఆయన కూడా ఏపీ రాజకీయాల మీద పొత్తుల మీద ఏమి మాట్లాడుతారు అన్నది ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి ఏపీ మీద అమిత్ షా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో వచ్చే వారం ఆంధ్ర రాజకీయం హీటెక్కడం ఖాయమని అంటున్నారు.