Begin typing your search above and press return to search.

జూనియ‌ర్‌ తో అమిత్ షా భేటీ.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ ఫైర్ రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   22 Aug 2022 6:55 AM
జూనియ‌ర్‌ తో అమిత్ షా భేటీ.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ ఫైర్ రీజ‌నేంటి?
X
రాజ‌కీయాల్లో చోటు చేసుకునే ప‌రిణామాల‌కు ఒక‌దానికి మ‌రొక దానికి మ‌ధ్య కార్యాకార‌ణ సంబంధాలు ఉంటాయి. అమెరికాకు జ‌లువు చేస్తే.. ఇండియా తుమ్ముతుంది.. అనే సామెత మాదిరిగానే రాజ‌కీయా ల్లోనూ ఎక్క‌డో ఏదో జ‌రిగితే.. దాని తాలూకు ప‌రిణామాలు మాత్రం స‌ర్వ‌త్రా కొన్ని పార్టీల‌పై ప‌డుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లోనూ అదే జ‌రుగుతోంది. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ.. ఈ కోవ‌లోకే వ‌స్తోంది. తాజాగా ఈ ఇద్ద‌రి భేటీపై జ‌న‌సేన నాయ‌కులు... ప‌వ‌న్ ఫ్యాన్స్‌.. ఫైర్ అవుతున్నారు.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం బీజేపీతో ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ పొత్తులో ఉంది. 2019 ఓట‌మి త‌ర్వాత‌.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్‌.. ఆ పార్టీతో క‌లిసి ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో ఉన్న బీజేపీకి బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షం.. ఎలాంటి సందేహం లేకుండా.. ప‌వ‌న్ పార్టీనే. అయితే.. ఎందుకో తెలియ‌దుకానీ.. బీజేపీ అధిష్టానం.. స‌హా కీల‌క నాయ‌కులు.. ప‌వ‌న్ విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రి.. విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌కు మోడీ మొహం చూపించ‌లేదు. ఇక‌, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షాతో మాత్రం ఒకే ఒక‌సారి అది కూడా.. పొత్తు పెట్టుకున్న రెండేళ్ల త‌ర్వాత భేటీ అయ్యారు. ఇక‌, ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం వ‌చ్చారు. ఈ సంద‌ర్భం గా అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవిని ఆహ్వానించారే త‌ప్ప‌.. ముందుగా.. ప‌వ‌న్‌ను పిల‌వ‌లేదు.అయితే.. చివ‌రి నిముషంలో మాత్రం ఆయ‌నకు ఆహ్వానం పంపించారు.

దీనికి ప‌వ‌న్ ఎలానూ రాలేదు. ఈ క్ర‌మంలో బీజేపీతో జ‌న‌సేన సంబంధాల‌పై.. విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం.. డిన్న‌ర్ పార్టీ చేసుకోవ‌డం.. వంటివి జ‌న‌సేన‌లో మ‌రింత ఆగ్ర‌హావేశాలు వ‌చ్చేలా చేస్తున్నాయి. అయితే.. జూనియ‌ర్‌తో షా భేటీ వెనుక‌.. ఆయ‌న‌ న‌టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీనే ఉంద‌ని.. ఆ సినిమాతో ఆయ‌న ఇంప్ర‌స్ అయి.. పిలిచార‌ని అన్నారు.

అయితే.. ప‌రిణామాల‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సొంత కూట‌మి పార్టీ అయిన‌.. జ‌న‌సేన‌కు మోడీ, అమిత్ షా.. ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. వారు ర‌గిలిపోతున్నారు.

బీజేపీ చెప్పిందే వాస్త‌వం అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో షా ముగ్ధులై ఉంటే.. ఇందులో అల్లూరి పాత్ర‌ధారి రామ్ చ‌ర‌ణ్‌ను కూడా పిలిచి ఉండాల్సింది. అదే స‌మయంలో ఇంత అద్భుత‌మైన సినిమాను అందించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని కూడా పిలిచి ఉండాల్సింది క‌దా! ఈ ప‌రిణామాల‌పై చ‌ర‌ణ్ అభిమానులు కూడా ఫైర‌వుతున్నారు.