Begin typing your search above and press return to search.
పొలిటికల్ లోల్లి పై అనంత శ్రీరామ్ ఓపెన్.. ఏమన్నారంటే..
By: Tupaki Desk | 4 July 2023 8:20 PM GMTగత కొద్ది రోజులు గా టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ మీద వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు సోషల్ మీడియా లో ఇష్టారీతి లో కామెంట్స్ పెడుతున్నారు. ఆయన పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకి కూడా దిగుతూ ఉండటం విశేషం. అయితే దీనికి కారణం ఉంది. సోషల్ మీడియా లో పొలిటికల్ మిసైల్ అనే పేజీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తూ పోస్టులు వస్తున్నాయి.
రాజశేఖరెడ్డి వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా, అవమానకర రీతి లో ఆ పోస్టులు ఉండటంతో వైఎస్ఆర్ అభిమానుల కి, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకి కోపం వచ్చింది. పొలిటికల్ మిసైల్ పేజీని అనంత శ్రీరామ్ నడిపిస్తున్నారని గతం లో ఉన్న పోస్టుల బట్టి వారు ఫిక్స్ అయ్యారు. దీంతో అతని మీద విమర్శల దాడి స్టార్ట్ చేశారు. చంద్రబాబు తో కలిగి దిగిన ఫోటో లని షేర్ చేస్తూ మరో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. దీంతో అనంతశ్రీరామ్ రంగం లోకి దిగి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పెట్టారు. గత కొంతకాలం లో సోషల్ మీడియా లో తన పై అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. పొలిటికల్ మిసైల్ పేజీ తో నాకు ఎలాంటి సంబంధం లేదని, అందులో ఉన్న పోస్టులు నేను పెట్టినవి కావని తేల్చేశారు.
తాను ఒక రచయితగా అన్ని పార్టీల వారికి పాటలు రాస్తానని, అది నా వృత్తిలో భాగమని అన్నారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీ మీద నాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని అన్నారు. ఒక వేళ రాజకీయ అభిప్రాయాలు తెలియజేయాల్సి వస్తే నేరుగా నా అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
అలాగే తాను ప్రస్తుతం అమెరికా లో ఉన్నానని, ఇండియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో తన పై తప్పుడు పోస్టులు పెట్టిన అందరి పైన సైబర్ క్రైమ్ పోలీసుల కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనకి సంబంధం లేని విషయం లోకి లాగి వ్యక్తిగత విమర్శలు చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని స్పష్టం చేశారు.