Begin typing your search above and press return to search.
దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ లోనే వేతన పురుషులు ఎక్కువట.. కేంద్ర సర్వే సంచలనం!
By: Tupaki Desk | 18 Jun 2022 4:30 PM GMTభారతదేశ సగటుతో పోలిస్తే వేతనం తీసుకునే పురుషులు, మహిళలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నారు. వేతనం తీసుకునే పురుషులు దేశంలో సగటున 22.7 శాతం ఉంటే ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 25.4 శాతంగా ఉండటం విశేషం.
అలాగే వేతనం తీసుకునే మహిళల సగటు దేశంలో 17.4 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం ఉండటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2020-21 లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అలాగే రాష్ట్రంలో 43 శాతం మంది పురుషులు, 38.1 శాతం మంది మహిళలు స్వయంఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మరో 31.6 శాతం మంది పురుషులు సాధారణ కూలీలుగా ఉన్నారు. అలాగే 44 శాతం మంది మహిళలు కూడా సాధారణ కూలీలుగా ఉపాధి పొందుతున్నారు.
కాగా ఈ సర్వేను దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహిళలు, అలాగే స్వయం ఉపాధిపై ఆధారపడినవారు, సాధారణ కూలీల శాతం ఎంతనేదానిపై నిర్వహించారు. చండీగఢ్, ఢిల్లీల్లో వేతన పురుషులు కంటే వేతన మహిళలు అత్యధికంగా ఉండటం గమనార్హం.
దేశంలో అత్యధికంగా చండీగఢ్‌లో 81.3 శాతం మంది వేతన మహిళలున్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే ఇక్కడ 63.9 శాతం మంది వేతన పురుషులున్నారు.
ఇక ఢిల్లీలో వేతన మహిళలు 75.6 శాతం మంది ఉండగా.. వేతన పురుషులు 65.4 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం. డామన్, డయ్యూలో 75.4 శాతం మంది వేతన పురుషులండగా.. 49.7 శాతం మంది వేతన మహిళలున్నారు. దేశంలో అత్యల్పంగా బిహార్‌లో 6.9 శాతం మంది వేతన మహిళలుండగా 7.6 శాతం మంది వేతన పురుషులున్నట్లు సర్వే వెల్లడించింది.