Begin typing your search above and press return to search.

ఏపీలో అన్న క్యాంటీన్ల రాజ‌కీయం.. వైసీపీ భ‌యానికి రీజ‌న్‌లు ఇవేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2022 2:30 AM GMT
ఏపీలో అన్న క్యాంటీన్ల రాజ‌కీయం.. వైసీపీ భ‌యానికి రీజ‌న్‌లు ఇవేనా?
X
ఏపీలో స‌రికొత్త రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌న హ‌యాంలో ప్రారంభించి.. అమ‌లుచేసిన‌.. అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించ‌డం.. పేద‌ల‌కు, కార్మికుల‌కు, రోజువారి వ‌ర్క‌ర్ల‌కు ఉచితంగా మూడు పూట‌లా ఆహారం అందించ డం.. దీనిని అధికార పార్టీ వైసీపీ నేత‌లు నిర్ద‌య‌గా అడ్డుకోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసుల‌ను మోహ‌రించ‌డం.. టీడీపీ నేత‌ల‌ను అరెస్టు చేయించ‌డం.. కేసులు పెట్టించ‌డం.. వంటివి రాష్ట్రంలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి పార్టీలైనా.. ప్ర‌బుత్వాలైనా.. పేద‌ల ప‌క్షానే ప‌నిచేస్తాయి. ఇప్పుడు ఏపీలో ప్ర‌తిప‌క్షం కూడా అదే ప‌నిచేస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

కానీ, వైసీపీ మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ అన్న క్యాంటీన్ల‌ను అడ్డుకుంటోంది. వేడి వేడి ఆహారాన్ని కాలువ‌ల్లో పార‌బోసి.. అన్న క్యాంటీ న్ల కోసం వేసిన‌.. పందిళ్ల‌ను.. ఫ్లెక్సీల‌ను కూడా తొల‌గిస్తోంది. దీంతో అస‌లు వైసీపీ ఎందుకు ఇంత‌గా అన్న క్యాంటీన్ల‌ను టార్గెట్ చేస్తోంది?  పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్ట‌డం ఇష్టం లేక‌నా.. లేక‌.. ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా?  అనేవి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి. పేద‌ల‌కు అన్నం పెట్ట‌డంలో వైసీపీకి కూడా వేరే ఉద్దేశం ఉంద‌ని అనుకోలేం. అయితే.. అన్న క్యాంటీన్ల‌ను న‌డిపితే.. ప్ర‌జ‌ల్లో టీడీపీ ప‌ట్ల సింప‌తీ పెరుగుతుంద‌నే భ‌యం ఆ పార్టీ నేత‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

పేద‌లు, కార్మికులు.. మ‌హిళ‌లు.. ల‌క్ష్యం వైసీపీ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతు న్నారు. అయితే.. ఇప్పుడు అన్న క్యాంటీన్ల‌కు ఈ వ‌ర్గాల నుంచే ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. క్యూలు క‌ట్టి మ‌రీ.. క్యాంటీన్ల‌లో వ‌డ్డిస్తున్న అన్నాన్ని తీసుకుంటున్నారు. ఇది వైసీపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారుతోంద‌నేది.. విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ``మేం ఇంత చేస్తున్నాం. ఇన్ని ప‌థ‌కాలు ఇస్తున్నాం. ఇప్పుడు.. క్యాంటీన్ల రూపంలో సింప‌తీ అంతా టీడీపీ కొట్టేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిని ఎలా సాగ‌నిస్తాం`` అని వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు చేసిన వ్యాఖ్య ఇది!

దీనిని బ‌ట్టి.. అన్న క్యాంటీన్లు రాజ‌కీయంగా వైసీపీకి పెద్ద మైన‌స్‌గా మారాయ‌ని తెలుస్తోంది. తాము అనేక ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నామ‌ని.. చెబుతున్నా.. ప్ర‌జ‌ల్లో ఎక్క‌డో తెలియ‌ని వెలితిని.. వైసీపీ ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌లేక పోతోంది. పెరిగిపోతున్న ధ‌ర‌లు.. క‌ట్ట‌డిలేద‌ని ద్ర‌వ్యోల్బ‌ణం.. వంటి సాధార‌ణ ప్ర‌జ‌ల‌నుముఖ్యంగా పేద‌ల‌ను ఇరుకున పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వారు టీడీపీ పెడుతున్న అన్న క్యాంటీన్ల వైపు మొగ్గు చూపు ప‌రిస్థితిని క‌ల్పించాయ‌నేది వాస్త‌వం. ఇది క‌నుక సక్సెస్ అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీడీపీని నిలువ‌రించి చేసిన రాజ‌కీయం కోల్పోయిన‌ట్టేన‌నే భావ‌న వైసీపీలో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్నా క్యాంటీన్ల‌పై వైసీపీ అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా.. ఈ రాజ‌కీయ పిడివాదంతో పేద‌ల‌కు అందుతున్న ఉచిత ఆహారంపై ప్ర‌భావం ప‌డ‌డం మాత్రం జీర్ణించుకోలేనిద‌ని అంటున్నారు.