Begin typing your search above and press return to search.
హుస్సేన్ సాగర్ వద్ద మరో భారీ ప్రయత్నం
By: Tupaki Desk | 4 Nov 2020 1:10 PM GMTహైదరాబాద్ కు మణిహారం హుస్సేన్ సాగర్. గౌతమ బుద్ధుడు కొలువై ఉన్న ఈ ఈ సాగరం హైదరాబాద్ పర్యాటకంలో కీలక ప్రదేశం. ట్యాంక్ బండ్ ను చూడడానికి ఇప్పటికీ జనాలు వస్తుంటారు. అక్కడ బతుకమ్మ సహా వివిధ వేడుకలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే హుస్సేన్ సాగర్ కు మరింత శోభనిచ్చే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది.
హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అభివృద్దితోపాటు పర్యాటక ప్రాంతాలపై ఫోకస్ చేసింది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించడానికి దుర్గం చెరువుపై తీగల వంతెన ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.
దీంతోపాటు హైదరాబాద్ లో బయోడైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. పట్టణ ప్రాంతంలోని ప్రజలు సేదతీరేందుకు గ్రీన్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తోంది.
ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పర్యాటక అభివృద్ధికి కీలకంగా ఉన్న హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
పీపీఈ పద్ధతిలో హుస్సేన్ సాగర్ వద్ద నైట్ బజార్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తామని వెల్లడించారు. అదే పద్ధతిలో ఈ బజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. బోర్డువాక్, పార్కింగ్, సిట్టింగ్ తదితర అన్ని సౌకర్యాలతో ఈ నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.