Begin typing your search above and press return to search.
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఢిల్లీకి ఆ ఉద్యమ నేత
By: Tupaki Desk | 20 Jun 2023 11:01 AM GMTతెలంగాణలో రాజకీయ పార్టీల కు కొదవ లేదు. అధికార బీఆర్ఎస్.. అధికార పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం కాంగ్రెస్.. బీజేపీ లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూడింటికి తోడు గా రాష్ట్రంలో ఉనికి లేనప్పటికి.. పాత వైభవంలో అంతో ఇంతో ప్రదర్శించాలన్న తపనలో టీడీపీ.. వీటికి తోడుగా కోదండరాం మాష్టారి టీజేఎస్.. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్సీ.. షర్మిల టీవైసీపీ.. వీరు కాకుండా కమ్యునిస్టులు.. ఇలా తెలంగాణ మొత్తం రాజకీయపార్టీ లతో కళకళలాడుతోంది.
ఇప్పుడున్న పార్టీలు సరిపోవన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రజాకవి గద్దర్.. తానో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ లో ఉన్నారు.
పొడుస్తున్న పొద్దుతో.. అంటూ తెలంగాణ లోని ప్రతి పల్లె లోనూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని రగిలించిన గద్దర్.. ఇప్పుడు గద్దర్ ప్రజా పార్టీ పేరు తో కొత్త దుకాణం పెట్టేందుకు రెఢీ అవుతున్నారు. గద్దర్ అలియాస్ విఠల్ రావు కొత్త పార్టీని ప్రకటించేందు కు వీలుగా తుది కసరత్తులో నిమగ్నమై ఉన్నారు.
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈ రోజు (మంగళవారం) ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈసీ అధికారుల్ని కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. గద్దర్ ప్రజాపార్టీ జెండా ను మూడు రంగులతో రూపొందించినట్లుగా చెబుతున్నారు. జెండా మధ్యలో పిడికిలిని పెట్టినట్లుగా చెబుతున్నారు.
మూడురంగుల్లో ఎరుపు.. నీలి.. ఆకుపచ్చ రంగులు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానంనుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న గద్దర్.. బీఆర్ఎస్ వైఫల్యాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల్లోని వైఫల్యాల్ని బట్టబయలు చేయటమే గద్దర్ లక్ష్యమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో.. తెలంగాణ ప్రజానీకం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.