Begin typing your search above and press return to search.
ఈ రోజు తో ఏపీ మండలి కి మంగళమేనా?
By: Tupaki Desk | 27 Jan 2020 4:27 AM GMTఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం ఒక విధానం. అందుకు భిన్నంగా వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవటం మరో పద్దతి. తొందరపాటుకు గురి కాకుండా ఉండాలన్న విధానంలో నిర్ణయాలు తీసుకోవటం లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. అయితే.. వేగంగా నిర్ణయాలు తీసుకోవటం ఒకందుకు మంచిదే అయినా.. కొన్నిసార్లు తప్పులు దొర్లే వీలుంది. తాజాగా ఏపీ మండలిని కొనసాగించాలా? రద్దు చేయాలా? అన్న అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. సీఎం జగన్ వైఖరి గురించి తెలిసిన వారు మాత్రం.. అలాంటిదేమీ ఉండదని.. ఏ విషయం లో అయినా ఎస్.. లేదంటే నో అన్న విషయంపై చాలా క్లియర్ గా ఉంటారన్న మాటను చెబుతున్నారు.
మండలి లో విపక్ష తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉండటం.. ఏపీ అధికారపక్ష బలం తక్కువ గా ఉండటం తో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మోకాలు అడ్డటం ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలో ఈ చికాకు నుంచి బయట పడేందుకు వీలుగా మండలి ని రద్దు చేయాలన్న యోచన లో సీఎం జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ రోజు జరిగే మంత్రి వర్గ సమావేశం.. అనంతరం జరిగే అసెంబ్లీ లో ఫోకస్ అంతా మండలి రద్దు అంశం మీదనే ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో జగన్ స్వయంగా చెప్పటం తో.. ఈ రోజు ఇష్యూ అంతా దీని మీదే నడుస్తుందన్న మాట వినిపిస్తోంది. స్వల్పకాలిక చర్చ అంటే.. మండలికి మంగళం పాడించటానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పాలి. చర్చ పేరుతో విపక్షం వ్యవహరిస్తున్న తీరును తుర్పార పట్టాలన్న ఆలోచన అధికార పక్షానికి లేదని చెబుతున్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే.. అవేమీ అమలు కాకుండా అడ్డుకుంటున్న మండలి విషయంలో కటువుగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మండలి రద్దు ద్వారా విపక్షానికి బలమైన సందేశంతో పాటు.. తమను ఇబ్బంది పెడితే.. ఎంతకైనా తాము సిద్ధమేనన్న విషయాన్ని తమ నిర్ణయంతో చెప్పాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మూడు రాజధానుల బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపినా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే.. సెలెక్ట్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు.
సెలెక్ట్ కమిటీ నిర్ణయం తర్వాత.. యథావిధి గా ప్రభుత్వం తాను అనుకున్నట్లుగా నిర్ణయం తీసుకొని పంపితే.. మండలి దాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి. ఇలాంటి అవకాశం ఉన్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకున్నంతనే అమలు కావాలన్న తొందరే మండలి కి మంగళం పాడేందుకు వీలుగా అడుగులు వేస్తున్నట్లు గా చెబుతున్నారు. మండలి రద్దు అంశం ప్రధానం గా చర్చ సాగి.. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ అంచనా ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి.