Begin typing your search above and press return to search.

యాపిల్ టాప్ 1గా ఉండడానికి కారణం అదేనట?

By:  Tupaki Desk   |   8 April 2023 8:00 AM GMT
యాపిల్ టాప్ 1గా ఉండడానికి కారణం అదేనట?
X
యాపిల్ కంపెనీ.. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 స్మార్ట్ ఫోన్ , గాడ్జెట్ కంపెనీగా ఉంది. వినియోగదారుల మనసు దోచుకునేలా టెక్నాలజీని రూపొందిస్తూ ఫోన్లు తయారు చేస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు ఇది గురిచేస్తోంది. దాని సక్సెస్ సీక్రెట్ ఆ క్వాలిటీనే. అందుకే ఆ క్వాలిటీ విషయంలో.. టెక్నాలజీ అప్ గ్రేడ్ విషయంలో కంపెనీ అస్సలు రాజీపడదట.. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను బయటపెట్టాడు. లోటు పాట్లను ఎలా తెలుసుకుంటాడో కూడా ఆయన విడమరిచి చెప్పాడు.

యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కిక్ తమ విజయరహస్యాన్ని లీక్ చేశాడు. కంపెనీ విజయానికి గల కారణాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘జీ.క్యూ’ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ప్రతిరోజు ఉదయం 5 గంటలకే కస్టమర్లు పంపించిన ఫీడ్ బ్యాక్ ను చదవడం ప్రారంభిస్తాను. మీరు కూడా టెక్నాలజీకి సంబంధించిన కంపెనీని కలిగి ఉంటే.. దాని గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో.. ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో తెలుసుకోవాలి’ అని తెలిపారు.

ఓ యూజర్ ఫీడ్ బ్యాక్ ను కూడా టిమ్ కుక్ పంచుకున్నారు. ‘ఐఫోన్ 14’ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ రోజు కారులో వెళుతున్న సమయంలో కారు డ్రైవర్ సృహ తప్పి పడిపోవడంతో అప్పుడు ఐఫోన్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడిని కాపాడిందట.. అత్యవసర శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఐఫోన్ 14లో ఉంది. మొబైల్ నెట్ వర్క్ లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఐఫోన్ 14 నుంచి కాల్ చేసుకోవచ్చు. ఇలా ఓ ఆపద నుంచే ఆ ఐడియా తమకు తట్టిందని కుక్ తెలిపారు.

ఇక ప్రతికూల అభిప్రాయాలు సైతం తమ విశ్వాసాన్ని తగ్గించలేవని.. తమ యూజర్ల అభిరుచులను మరింతగా అర్థం చేసుకునేందుకు అవి మార్గం చూపిస్తాయన్నది టిక్ కుక్ అభిప్రాయం. యూజర్లు ఏం ఆలోచిస్తున్నారో.. ఏం కోరుకుంటున్నారో తాము తెలుసుకొని ఇవ్వడమే తమ విజయరహస్యం అని తెలిపారు. అందుకే టాప్ 1 అగ్రగామి సంస్థగా ఉంటున్నామని తెలిపారు.

మొత్తంగా ప్రజలు, వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకొని ఆ లోటుపాట్ల ప్రకారం యాపిల్ కంపెనీ వచ్చే వెర్షన్ లో సరిచేసుకుంటుందని.. వారి అభిప్రాయాలకు అనుగుణంగానే కొత్త ఫోన్లు, టెక్నాలజీని అభివృద్ధి చేస్తుందన్న విషయం వెలుగుచూసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.