Begin typing your search above and press return to search.
చైనావాళ్లు డయాబెటిక్ పేషెంట్స్ నా?
By: Tupaki Desk | 21 Dec 2022 1:30 PM GMT35 ఏళ్లు దాటగానే మధుమేహం మనిషిని ఆవరిస్తోంది. వేళా పాలాలేని ఉద్యోగాలు.. జంక్ ఫుడ్.. అతిగా మద్యం తాగడం వల్ల మన శరీర జీవ క్రియ దెబ్బతిని మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇష్టానుసారంగా తింటున్న చిన్న పిల్లలకు సైతం ఈ మధుమేహ ముప్పు తప్పడం లేదు.
మధుమేహం నుంచి తప్పించుకోవడం కష్టమే అయినా దాన్ని నియంత్రించడం సులువేనని చెబుతున్నారు.అయితే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. దీనికి నియంత్రణ తప్ప నివారణ లేదు.
మధుమేహం బాధితులు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా చైనాలో ఉన్నారు. చైనాలోని ఫుడ్ కూడా ఇందుకు కారణం. చైనీస్ తినే ఫాస్ట్ ఫుడ్ లో అస్సలు ఫైబర్ ఉండదు. షూగర్ కంటెంట్ చాలా ఎక్కువ. నూడుల్స్ లాంటి చైనీస్ ఫుడ్ వల్ల షుగర్ తొందరగా వస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహం ఉన్న రోగులు చైనాలోనే ఉన్నారు.
చైనాలో 140.9 మిలియన్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. అందుకే చైనీయులు ప్రపంచంలోనే నంబర్ 1లో ఉన్నారు. ఇక చైనా తర్వాత షుగర్ వ్యాధి అత్యధికంగా ఉంది భారత్ లోనే.. భారత్ లో 74.2 మిలియన్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులున్నారు.
ఇక చైనా, భారత్ తర్వాత పాకిస్తాన్ లో 33 మిలియన్లు, అమెరికాలో 32.2 మిలియన్లు, ఇండోనేషియాలో 19.5 మిలియన్లు, బ్రెజిల్ 15.7 మిలియన్లు, మెక్సికో 14.1 మిలియన్లు, బంగ్లాదేశ్ 13.1 మిలియన్లు, జపాన్ 11.0 మిలియన్లు మంది ఉన్నారు.
చైనాలో మధుమేహం ఉన్న రోగులలో దాదాపు 95% మంది టైప్ 2 డయాబెటిస్ ని కలిగి ఉన్నారు. చైనాలో మధుమేహం యొక్క ప్రాబల్యం వేగంగా పెరగడానికి అధిక బరువు , ఊబకాయం , శారీరక శ్రమ తగ్గడం, ఆర్థిక అభివృద్ధి, జీవనశైలి మార్పుల కారణంగా ఏర్పడుతుంది. ఈ కారణంగానే డయాబెటిస్ తో చనిపోయిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.