Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లాలో విజిటింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ అయ్యారా?

By:  Tupaki Desk   |   2 Sept 2020 2:40 PM IST
ప్రకాశం జిల్లాలో విజిటింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ అయ్యారా?
X
ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా పేరుకే.. ఓట్లు అడిగినప్పుడు అమ్మా.. అయ్యా అని ఓటర్లను బతిమిలాడారు. ఓట్లేశాక పత్తా లేకుండా పోయారట. అమావాస్యకు, పౌర్ణమికి చుట్టుపు చూపుగా వస్తున్నారు. దీంతో తమ సమస్యలు తీరుతాయని కలలుగన్న ప్రజల ఆశలు అడియాసలు అవుతున్నారని వారంతా వాపోతున్నారు.

ఏపీలో ఉన్న వెనుకబడిన జిల్లా ప్రకాశంలో అసలు అభివృద్ధి జరగడం లేదు అని.. అస్సలు ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో లేకుండా వాళ్ల పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాళ్ల స్థావరాలు వేరే రాష్ట్రాల్లో వేరే నియోజకవర్గాల్లో ఉన్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెనుకబడిన ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 5 నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని.. అప్పుడు రైతుల కష్టాలన్నీ తీరుతాయని అంటున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన తరువాత వెలుగొండ ప్రాజెక్ట్ కింద ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడ లేకుండా.. సీఎం దగ్గరికి వెళ్లి త్వరగా పూర్తి చేయాలని అడగకుండా ఎక్కడో ఉంటూ అభివృద్ధిని ఏమీ పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరులో.. ఒక ఎమ్మెల్యే వేరే నియోజకవర్గంలో ఇంకొక ఎమ్మెల్యే హైదరాబాద్ లో.. ఇంకొక ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ లోనే ఉంటూ నియోజకవర్గం ప్రజలతో ఏ విధమైన సంబంధాలు నెరపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకోకుండా వాళ్లు కేవలం విజిటింగ్ ఎమ్మెల్యేగా తయారవుతున్నారని.. అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.