Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ లో అలాంటి తప్పుడు పని చేసిన బాలీవుడ్ నటుడు

By:  Tupaki Desk   |   3 March 2023 11:02 AM GMT
స్టాక్ మార్కెట్ లో అలాంటి తప్పుడు పని చేసిన బాలీవుడ్ నటుడు
X
పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రముఖులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తాత్కాలిక లాభాల్ని సొంతం చేసుకోవచ్చు కానీ.. ఒకసారి తమ తప్పుడు పనులు బయటపడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఆయన సతీమణి.

వీరే కాకుండా మరికొందరు కూడా తప్పుడు పనులకు పాల్పడినట్లుగా సెబీ ఆరోపిస్తోంది. యూట్యూబ్ చానళ్లలో వీడియోలు పెట్టటం ద్వారా రెండు కంపెనీల షేర్ల ధరల్ని ప్రభావితం చేసి.. వాటిని కృత్రిమంగా పెంచినట్లుగా సెబీ గుర్తించింది. దీంతో చర్యలు చేపట్టింది.

బాలీవుడ్ నటుడు వార్సితో పాటు ఆయన సతీమణి.. మరో 43 మందిపైనా వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అలాంటి తప్పుడు పని ఎలా చేశారన్న విషయంలోకి వెళితే.. సాద్నా బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్.. షార్ప్ లైన్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ సంస్థల షేర్లు కొనుగోలు చేయాలని పేర్కొంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా మదుపరులకు సిఫార్సు చేసినట్లుగా గుర్తించారు. ఇలా చేయటం ద్వారా ఆయా సంస్థల షేర్ల ధరలను కృత్రిమం పెంచినట్లుగా సెబీ తేల్చింది.

ఈ వ్యవహారంలో సాధ్నా బ్రాడ్ కాస్ట్ కూడా జోక్యం చేసుకుందన్న విషయాన్ని గుర్తించిన సంస్థ.. ఆ కంపెనీ ప్రమోటర్లను సెక్యురిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. అదే సమయంలో అక్రమంగా సంపాదించిన రూ.54 కోట్ల లాభాల్ని కూడా స్వాధీనం చేసుకున్న విషయాన్ని సెబీ వెల్లడించింది.

గతంలోనూ ఇదే తరహాలో మరో రెండు యూట్యూబ్ చానళ్లలో కొన్ని షేర్లను సిఫార్సు చేయటం ఆ తర్వాత వాటి షేరు ధరను కృత్రిమంగా అమ్మి లాభాల్ని ఆర్జించే వైనాన్ని గుర్తించి వారిపైనా చర్యలు చేపట్టింది. కక్కుర్తి కాకుంటే.. ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఎందుకు? బోనులో నిలవటం దేనికి? అన్న ప్రశ్నలు మనసులోకి రాక మానదు. అదే ఉంటే.. ఇప్పుడీ రోజున ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.