Begin typing your search above and press return to search.
దక్షిణ టిబెట్ కాదు అరుణాచలే.. భారత్ కు అమెరికా దన్ను
By: Tupaki Desk | 6 April 2023 10:30 AM IST2017లో ఆరు ప్రాంతాలు.. 2021లో దాదాపు 15 ప్రాంతాలు.. మూడు రోజుల కిందట ఏకంగా 11 ప్రాంతాలు.. ఇదీ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో చైనా పేర్లు మార్చిన ప్రాంతాల సంఖ్య. అసలు అరుణాచల్ భారత్ ది కాదనేది చైనా వాదన. దానిని దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తూ, దానికి జాంగ్ నన్ గా పేరు పెట్టుకుని పిలుచుకుంటోంది. అయితే, ఆదివారం చైనా ఏకంగా 11 ప్రాంతాలకు పేరు మార్చడం పై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ తీరు ఆ దేశానికి అలవాటేనని పేర్కొంది. పేర్లు మార్పడి.. వాస్తవాలను మార్చలేదని గుర్తుచేసింది. అరుణాచల్ అప్పుడు, ఎప్పటికీ భారత్ దేనని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఈ పరిణామం కారణమైంది. కాగా, చైనా మాత్రం తన చర్యను సమర్థించుకుంటూ కుటిల బుద్ధిని చాటుతోంది. తమకు ఆ హక్కు ఉందంటూ నోరుపారేసుకుంటోంది.
అగ్ర రాజ్యం అండాదండ..
చైనా ఎక్కడ ఉన్నా తీవ్రంగా వ్యతిరేకించే అమెరికా.. సహజంగా అరుణాచల్ ప్రదేశ్ ఉదంతంలో భారత్ కు మద్దతు ప్రకటించింది. ఆ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చాలాకాలం నుంచి తాము అలానే గుర్తిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. "కేవలం ప్రాంతాల పేర్లు మార్చి ఆ భూభాగాన్ని హక్కు కింద దక్కించుకునే ఏకపక్ష ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం" అంటూ అమెరికా కుండబద్దలు కొట్టింది.
కుటిల బుద్ధి చైనా.. అందుకే కోపం
బౌద్ధ గురువు దలైలామా 2017లో అరుణాచల్ లో పర్యటించారు. చైనా ఆక్రమిత టిబెట్ నుంచి పారిపోయి దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా భారత్ లోనే ఉంటూ చైనాకు కంటగింపుగా మారారు. ఆయన అరుణాచల్ లో పర్యటన చైనాకు కంటగింపుగా మారింది. అందుకే అప్పటినుంచి అరుణాచల్ లో పేర్లు మారుస్తోంది. భారత్ ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ లోని 'జాంగ్‌నన్' అని అభివర్ణిస్తూ 2 భూభాగాలు, 2 నివాస ప్రాంతాలు, 5 పర్వతాలు, 2 నదులకు కొత్త పేర్లను ప్రకటించింది. ఈ చర్య పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చి వెల్లడించారు. చైనా గతంలోనూ ఇలాంటి చర్యలకు
పాల్పడింది. 2017లో తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు చైనీస్ పేర్లను విడుదల చేసింది. 2021లో 15 ప్రాంతాలకు రెండోసారి పేర్లను విడుదల చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.