Begin typing your search above and press return to search.

ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై అసదుద్దీన్ ట్వీట్

By:  Tupaki Desk   |   25 Feb 2020 6:00 AM GMT
ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై అసదుద్దీన్ ట్వీట్
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నా కూడా ఆందోళనలు తగ్గుముఖం కాకపోగా మరింత తీవ్రమయ్యాయి. తాజాగా ఈ ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. సోమవారం మూకదాడులు జరిగి ఐదుగురు మృతిచెందడంతో కలకలం రేగింది. అయితే ఈ ఆందోళనలు పక్కనే ఉత్తరప్రదేశ్ కు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమై ఉద్రిక్తతలకు దారితీయడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి ఆందోళనలు తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడులపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించాడు.

ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఓ కవిత రాసి ఢిల్లీలో ఆందోళనలకు చెందిన రెండు ఫొటోలు ట్వీట్ చేశారు. ఆ కవిత ఇదే..
తుమ్ హమార ఖతర్ కర్దో
హమ్ బన్కే భూట్ లికేంగే
తుమ్హారే ఖాతల్ కే సారే సాబూత్ లికేంగె
తుమ్ అదాల్తాన్ సే చుట్కులే లిఖో
హమ్ దివారోంపే ఇన్సాఫ్ లికెంగే
తుమ్ జమిన్ పే జుమ్ల్ లికో
అసమాన్ పే ఇంక్వాలాబ్ లిఖా జాయెగే
సబ్ యాద్ రఖా జాయెగె

ప్రముఖ ఉర్దూ రచయిత అమీర్ అజీజ్ రాసిన కవితలోని కొన్ని వాక్యాలను తెలిపారు. కుటుంబంతో సహా న్యూఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధాని తో పాటు ఉత్తర ప్రదేశ్‌ లో భారీగా హింసాత్మక ఘటనలు నమోదు కావడం, ఏకంగా అయిదుమంది దుర్మరణం పాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించినప్పటికీ.. అవి తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం ఆ అల్లర్లు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌ కు వ్యాపించాయి. ఘజియాబాద్, అలీగఢ్, బులంద్ షహర్‌లల్లో అల్లర్లు చెలరేగాయి. అలీగఢ్‌ లో నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మక పరిస్థితులకు దారి తీశాయి. ఆందోళనలు ఇంకా కొనసాగుతుండడంతో స్థానికం గా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.