Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి రావాలని ఒత్తిళ్ళు ..అందుకే దాదాకు గుండెపోటు అశోక్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Jan 2021 10:02 AM IST
పాలిటిక్స్ లోకి రావాలని ఒత్తిళ్ళు ..అందుకే దాదాకు గుండెపోటు అశోక్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు
X
సీపీఎం నాయకుడు అశోక్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌరభ్ గంగూలీని రాజకీయాల్లోకి రావాలని కొందరు ఒత్తిడి చేశారని ఆ ఒత్తిళ్ళ కారణంగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. బెంగాల్లో ఎన్నికలు దగ్గర పడటంతో కొన్ని పార్టీలు గంగూలీ క్రేజ్ ని వాడుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఈ ఒత్తిళ్ళు భరించలేకే దాదాకు ఈ పరిస్థితి వచ్చిందని అశోక్ ఆరోపణ చేశారు. శనివారం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబీకులు కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియో ప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

ఆదివారం గంగూలీని అశోక్ భట్టాచార్య ఆస్పత్రిలో గంగూలీని పరామర్శించారు. అనంతరం మీడియతో మాట్లాడుతూ కొన్ని పార్టీలు దాదా క్రేజ్ ని వాడుకోవాలని చూస్తున్నాయి. అలా చేయడం అంటే ఆయన్ని ఒత్తిడికి గురిచేయడమే. ఆయన్ని ఒక స్పోర్ట్స్ ఐకాన్ గా మాత్రమే చూడండన్నారు. రాజకీయాల్లోకి రావొద్దని గత వారమే తాను గంగూలీకి చెప్పాను. ఆయన నా అభిప్రాయాలను వ్యతిరేకించలేదని చెప్పారు. అయితే అశోక్ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డారు. కొంతమంది తమ మానసిక పరిస్థితి బాగోలేక ప్రతి దానిలో రాజకీయమే చూస్తారు అని మండిపడ్డారు.

గంగూలీకున్న లక్షలాది అభిమానులు కోరుకున్నట్లే తాము కూడా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో గంగూలీని పరామర్శించిన టీఎంసీ నేత, మంత్రి శోభండేబ్ చటర్జీ మాట్లాడుతూ గంగూలీని పార్టీలోకి చేర్చాలని ఎప్పుడూ ప్రయత్నం జరగలేదని, ఆయన్ని ఒక స్పోర్ట్స్ ఐకాన్ గా చూస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం.. అని అన్నారు. ఓ వైపు దాదా ఆస్పత్రి పాలవగా రాజకీయ నాయకులు మాత్రం దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తుండటం గమనార్హం.