Begin typing your search above and press return to search.

నేత‌ల‌ను న‌మ్ముకుని విర్ర‌వీగితే.. దిక్కులేని చావే.. అతీఖ్ నేర్పుతున్న పాఠం!

By:  Tupaki Desk   |   16 April 2023 12:40 PM GMT
నేత‌ల‌ను న‌మ్ముకుని విర్ర‌వీగితే.. దిక్కులేని చావే.. అతీఖ్ నేర్పుతున్న పాఠం!
X
అధికారంలో ఉన్న పార్టీల‌ను, నేత‌ల‌ను చూసుకుని విర్ర‌వీగితే.. ఏం జ‌రుగుతుందో.. నేర సామ్రాజ్యాల‌ను స్థాపించుకుని.. తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకుంటే.. ఏమ‌వుతుందో.. ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దే శ్‌లో జ‌రిగిన అతీఖ్‌, అత‌ని సోద‌రుడు.. అష్ర‌ఫ్ అహ్మ‌ద్ దిక్కులేని చావు క‌ళ్ల‌కు క‌డుతుంది. అతీఖ్ అహ్మ‌ద్ మామూలు వ్య‌క్తి కాదు. అల‌హాబాద్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న 1991 నుంచి 2004 వ‌ర‌కు జ‌రిగిన ఐదు ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రంగా, స‌మాజ్‌వాదీ పార్టీ త‌ర‌ఫున‌, అదేవిధంగా అప్నాద‌ళ్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇది, ఒక రాజ‌కీయ నేత జీవితంలో కీల‌క మ‌లుపు. అంతేకాదు, 2004లో జ‌రిగిన పార్లెమెంటు ఎన్నిక‌ల్లో ఫూల్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. అంటే.. ఆయ‌న‌కు ఉన్న ప్ర‌జాభిమానం ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది. కానీ, ఏం ప్ర‌యోజ‌నం.. క‌న్న కొడుకును పోలీసులు దారుణంగా కాల్చి చంపిన రెండు రోజుల్లోనే గుర్తు తెలియ‌ని ముగ్గురు వ్య‌క్తులు.. అతీఖ్‌ను సైతం.. న‌డిరోడ్డుపై కాల్చి చంపారు. దీంతో కుప్ప‌కూలిపోయిన‌.. అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు అతీఖ్‌.

ప్రాణాలు కోల్పోయిన అతీఖ్‌ను రెండు చేతులు.. రెండు కాళ్లు పైకెత్తి.. ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన పోలీసులు ఒక వ్యాన్‌లో ఎత్తి ప‌డేశారు. దీనికి కార‌ణం.. హ‌త్య‌లు, దొమ్మీలు, దోపిడీలు.. రాజ‌కీయ హ‌త్య‌లు.. బెదిరింపులు.. వంటి అనేక దందాలు అతీఖ్ చేయ‌డ‌మే. ఒక నేర సామ్రాజ్యాన్ని ఆయ‌న ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా స్వ‌తంత్రంగా ఎదిగిన ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

''నేతాజీ కోసం.. ఏమైనా చేస్తా. ప్రాణం ఇస్తా.. ప్రాణం తీస్తా' అంటూ... ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన‌.. అతీఖ్‌.. ములాయంను సీఎం చేసేందుకు చేయ‌ని దందా లేదు. ఆగ‌డం లేదు. ఎస్పీ నేత‌లు పోటీకి దిగితే చాలు.. తానే గెలిపిస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

ఇలా.. రాజ‌కీయ పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయిన అతీఖ్‌ను ఏకంగా ఆ పార్టీనే భ‌రించ‌లేక‌.. ప‌క్క‌న పెట్టేసే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. ఎలాంటి స్తాయికి దిగ‌జారాడో అర్థం చేసుకోవ‌చ్చు. అదే.. ఒక అసాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న మిగిలి ఉంటే.. ప్ర‌జాభిమానం సొంతం చేసుకునేవాడు.

రాజ‌కీయాల్లో ఎద‌గేందుకు కాకుండా.. రాజ‌కీయాల‌ను.. రాజ‌కీయ నేత‌ల‌ను త‌న‌కు అనుకూలంగా.. వారికి తాను అనుకూలంగా మారిపోయి.. ప్ర‌తిప‌క్షాల‌పై కాలు రువ్వితే.. ఇలాంటి బ‌తుకే ఉంటుంద‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేకుండా.. అతీఖ్ జీవితం పెద్ద ఉదాహ‌ర‌ణ‌. అతీఖ్ ఎంపీగా ఉన్న‌న్నాళ్లు.. ప్ర‌తిప‌క్షాలు నోరు విప్పేందుకు కూడా భ‌య‌ప‌డ్డాయంటే.. ఎలాంటి దారుణాల‌కు ఆయ‌న కేరాఫ్ గా ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఏదేమైనా.. రాజకీయాల‌ను.. అధికారంలోఉన్న వారిని చూసుకుని రెచ్చిపోతే.. చివ‌ర‌కు అది వారిని ఈ గ‌తికే దిగ‌జారుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.