Begin typing your search above and press return to search.
విచారణలోనే పిండేస్తున్నారా ?
By: Tupaki Desk | 20 April 2023 7:30 PM ISTవివేకానండరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టుచేయాలన్నది సీబీఐ పట్టుదల. అయితే హైకోర్టు ఆదేశాల కారణంగా సాధ్యంకాలేదు. ఎంపీని 25వ తేదీ వరకు అరెస్టు చేయద్దని ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ముందస్తు బెయిల్ మంజూరుచేసిన కోర్టు విచారణ కంటిన్యు చేయచ్చని చెప్పింది. అరెస్టు ఎలాగూ సాధ్యంకాలేదు కాబట్టి కనీసం విచారణలో అయినా పిండేద్దామని అనుకున్నట్లుంది. అందుకనే ప్రతిరోజు విచారణకు పిలిపిస్తోంది. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే దాదాపు 8 గంటలు విచారించింది.
ఇది సరిపోదన్నట్లుగా గురువారం కూడా విచారణకు రమ్మని చెప్పింది. ఈరోజు ఎన్నిగంటలు విచారిస్తుందో తెలీదు. సీబీఐ వ్యవహారం చూస్తుంటే అవినాష్ ను 25వ తేదీవరకు ప్రతిరోజు విచారించేట్లుగానే ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది.
ఇది సరిపోదన్నట్లుగా మళ్ళీ ప్రతిరోజు విచారణ మొదలు పెట్టింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రతిరోజు విచారించినంత మాత్రాన సీబీఐకి దొరికే ఆధారాలు ఏముంటాయి ? జరిగిన హత్యలో అవినాష్ కు కూడా పాత్రుందని సీబీఐ చెప్పటానికి ఉన్న ఆధారం గుగుల్ టేకౌట్ మాత్రమే. అయితే దాన్ని సరైన ఆధారంగా కోర్టు అంగీకరించలేదు.
దాంతో లాభంలేదని వివేకా హత్యకు రు. 40 కోట్ల డీల్ ఎవరితో మాట్లాడారు ? కోటిరూపాయల అడ్వాన్స్ మీరిచ్చిందేనా ? లాంటి ప్రశ్నలు మొదలుపెట్టింది. డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి మీ ఇంట్లో ఎందుకున్నాడు ? లాంటి ప్రశ్నలతో ఏమైనా ఉపయోగముందా అన్నదే అర్ధం కావటంలేదు. ఎంపీకి డాక్టర్ ఉదయ్ సన్నిహితుడు. కాబట్టి వాళ్ళిద్దరు కలవటంలో తప్పేముంది ?
ఇక వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఏమొచ్చిందని అవినాష్ వాదిస్తుంటే రు. 40 కోట్ల డీల్ కుదుర్చుకున్నది మీరేనా అని అడిగితే ఎంపీ అంగీకరిస్తాడా ? ఎంపీ డీల్ కుదుర్చుకున్నాడనేందుకు సీబీఐ దగ్గర ఏమన్నా ఆధారముందా ? అన్నదే ప్రశ్న. ఉంటే దాన్ని ఎంపీ ముందు ప్రవేశపెట్టాలంతే. హత్యలో ఎంపీ పాత్రుందని అంటున్న సీబీఐ అందుకు తిరుగులేని ఆధారాలను సంపాదించాలి. ఆధారాలు లేనపుడు ఇలా ఎన్నిరోజులు విచారణ పేరుతో పిండినా ఎలాంటి ఉపయోగముండదు.