Begin typing your search above and press return to search.
యూపీలో బీజేపీ గెలుపు.. తెలంగాణలో ఊపు.. అందుకేనా కేసీఆర్ ఉద్యోగ బాట?
By: Tupaki Desk | 9 March 2022 11:30 PM GMTఉత్తరప్రదేశ్.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా, అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్ల పరంగా యూపీదే అగ్ర స్థానం. ఆ రాష్ట్రం లోక్ సభ ఎన్నికల్లో ఎటు మొగ్గితే దేశంలో అదే పార్టీ లేదా కూటమి అధికారం కైవసం చేసుకుంటుంది. యూపీలో 80 లోక్ సభ సీట్లు ఉండడమే దీనికి కారణం.
ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్న సందర్భాల్లో ఆ పార్టీ అధినేతలు, ఎంపీలు కేంద్రంలో కీలక శాఖలు చేపట్టారు. కాంగ్రెస్ లేదా బీజేపీ వంటి జాతీయ పార్టీలు అధికం ఎంపీ స్థానాలు దక్కించుకున్నా ఇదే పరిస్థితి. అలాంటి యూపీలో గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 403 స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టేది ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథా? మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నా? అన్న విషయం కొన్ని గంటల్లో తేలనుంది.
ఎస్పీ అనుకుంటే.. బీజేపీ వాస్తవానికి ఐదేళ్లుగా యూపీలో బీజేపీ అనేక విధాలుగా పాతుకుపోయింది. యోగి పాలన అయితేనేమి? కాశీ రోడ్ల విస్తరణ, గంగా శుద్ధి, మరికొన్నిప్రగతి పనులతో కమలం పార్టీ పునాదులు పటిష్ఠం చేసుకుంది. ఇక.. గూండారాజ్ కు పేరుమోసిన యూపీలో యోగి వరుస ఎన్ కౌంటర్లు చేపట్టి శాంతిభద్రతలకు పెద్దపీట వేశారు. దీంతో ఎంతోమంది గ్యాంగ్ స్టర్లు లొంగిపోవడమో, లేదంటే హతులవడమో జరిగింది.
ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే బ్రాహ్మణ సామాజికవర్గాన్ని యోగి నిర్లక్ష్యం చేశారని, కొవిడ్ కట్టడిలో విఫలమయ్యారని.. గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలే అందుకు నిదర్శమని విమర్శలున్నాయి. దీనికితోడు లఖీంపూర్ ఖేరి పెద్ద లోపమైంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనాన్ని పోనివ్వడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
తొలి మూడేళ్లలో యోగికి మంచి మార్కులే పడినా.. చివరి రెండేళ్లలో చోటుచేసుకున్న చేదు పరిణామాలే ఎన్నికల సమయంలో ప్రతిబంధకాలుగా మారాయి. కాగా, అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అనూహ్యంగా పుంజుకుని బీజేపీని సవాల్ చేసింది. బీజేపీ సర్కారు వైఫల్యాలను అఖిలేశ్ తూర్పారపడుతూ ముందుకెళ్లడంతో ఆయనకు ప్రజా స్పందన లభించింది.
ఎన్నికల సందర్భంగా కాషాయ పార్టీ కంగారూ చూస్తే.. అఖిలేశ్ గెలుపు ఖాయమని అనిపించింది. కొందరు మాత్రం.. బొటాబొటీ మోజర్టీతో బీజేపీనే గెలుస్తుందని అఖిలేశ్ గట్టిపోటీకి పరిమితం అవుతారని పేర్కొన్నారు.సర్వేల ఝలక్ తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు చెప్పినట్లుగా మొత్తంగా చూస్తే యూపీలో అఖిలేశ్ పార్టీ గెలుపు ఖాయమని నిన్నమొన్నటివరకు అంచనా ఉండేది.
అన్నిటికి మించి ఎన్నికల వాతావరణం ఈ సంగతినే ప్రస్ఫుటంగా చూపింది. కానీ, ఏడు దశల పోలింగ్ పూర్తయిన అనంతరం ఈ నెల 7న విడుదల చేసిన ఎగ్టిట్ పోల్స్ మాత్రం భిన్నమైన అంచనాను చూపాయి. అన్ని ప్రధాన మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీనే గెలుస్తుందని స్సష్టం చేశాయి. ఒక్కటి మాత్రమే ఎస్పీకి చాన్సుందని చెప్పింది.
చివరకు వచ్చేసరికి అంతా మారిపోయిందన్నమాట. ఇప్పుడు ఎటుతిరిగి యూపీలో బీజేపీదే విజయం అవుతుండడం పలు రాష్ట్రాల్లో సమీకరణాలను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికితగ్గట్లే చర్యలు ఉన్నాయి. తొలి ప్రభావం తెలంగాణలోనేనా? తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అనూహ్యంగా, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మేరకు ఉద్యోగాల భర్తీని ప్రకటించారు.
అందరూ 50 వేల ఉద్యోగాల భర్తీ అనుకుంటే 91 వేలు (కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కలిపి) భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇది మామూలు చర్య కాదు. యావత్ తెలంగాణ యువతను కదిలించే ప్రకటన. అయితే, దీనిని లోతుగా ఆలోచిస్తే చాలా కథ కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరే ఉంది. టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలో ఉండడంతో ఆ పార్టీపై కొంత వ్యతిరేకత సహజం.
ఈ వ్యతిరేకత కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్ర నాయకత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేల మీద ఎక్కువగా ఉంది. దీనికితోడు కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికల్లో కేంద్ర రాజకీయాలు ఉన్నాయి. కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని.. తెలంగాణలో కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రణాళికల్లో ఉన్నారు. దీనిప్రకారం కూటమి యత్నాలు సాగించారు. మహారాష్ట్ర వెళ్లారు.
యూపీ తర్వాత దేశంలో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ఇంకా ఇతర పార్టీల నేతలనూ కలిసే అవకాశం కనిపిస్తోంది. కాగా,వీటి మధ్యలో యూపీ ఎన్నికల పాత్ర కీలకమైంది. ఇక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి రాదనేది కేసీఆర్ అంచనా.
అయితే, ఎస్పీపై ముందున్న సానుకూలత.. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కనిపించలేదు. బీజేపీదే మరోసారి పీఠమని చెబుతున్నాయి. అదే జరిగితే తెలంగాణలో పరిణామాలు మారిపోతాయి. తెలంగాణలో ట్రయాంగిల్ తప్పదా? యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే.. అది జాతీయ రాజకీయాలపైనే కాక తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.
బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ దూకుడు మీదుంది. సంజయ్ వచ్చాక పార్టీ లైన్ మారిపోయింది. చేరికలు, విజయాలతో ఆయన తనదైన ముద్ర చాటారు. ఇక బీజేపీ యూపీలో మళ్లీ గెలిస్తే తెలంగాణ నాయకత్వానికి మరింత బూస్ట్ అందినట్లే. కొన్ని ప్రత్యేక
పరిస్థితుల రీత్యా యోగి నాయకత్వాన్ని చూపుతూ తెలంగాణలో బీజేపీ ముందుకెళ్లే యత్నం చేయొచ్చు.
యూపీలో బీజేపీ గెలవడం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ కు మింగుడుపడని పరిణామమే. యూపీలో కాంగ్రెస్ కు అధికారం దక్కదనేది అందరికీ తెలిసిందే. కాకపోతే గౌరవప్రద సంఖ్యలో సీట్లయినా వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు చెప్పుకొనేందుకు అవకాశం ఉంటుంది. యూపీలో బీజేపీ గెలిచి.. కాంగ్రెస్ కూ మంచి సంఖ్యలో సీట్లు వస్తే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం. అప్పుడు ముక్కోణంలో ఎవరు విజేతనో చూడాలి.