Begin typing your search above and press return to search.
పవన్ ను కలిసిన ఎంపీని లేపేసేందుకు ప్రయత్నించారట!
By: Tupaki Desk | 19 Jan 2020 2:30 PM GMTజనసేన పార్టీ అధ్యక్షుడు - సినీనటుడు పవన్ కళ్యాణ్ గత వారం జరిపిన ఢిల్లీ పర్యటన గుర్తుండే ఉంటుంది. బీజేపీతో పొత్తుకు ముందు కాషాయ పార్టీ నేతలు - ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాను కలిశారు. ఆయనతో పాటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ - సౌత్ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యలు కూడా ఈ భేటీలో ఉన్నారు. ఈ టూరులో కీలకంగా మారిన ఎంపీ తేజస్వీ సూర్య హత్యకు కుట్ర జరిగిందట. ఈ కుట్రను పోలీసులు ఛేదించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏపై ప్రజల్లో అవగాహన కోసం సీఏఏకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలని పార్టీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల బెంగళూరు టౌన్‌హాల్ దగ్గర ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళుతున్న ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తపై దాడి జరిగింది. సదరు వ్యక్తులను SDPI కార్యకర్తలుగా గుర్తించారు. వారిని విచారించగా సంచలన కుట్ర కోణం బయటపడింది. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు యువ బ్రిగేడ్ నేత చక్రవర్తి సూలిబెలెను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు ఆరుగురు నిందితుల పోలీసుల వద్ద అంగీకరించారు. ఎస్ డీపీఐ కార్యకర్తలను కోర్టులో హాజరుపరిచి సమగ్ర విచారణ చేపడుతున్నారు.
దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన తేజస్వి సూర్య ఆది నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రమంత్రి అనంతకుమార్ ఆరుసార్లు గెలిచిన దక్షిణ బెంగళూరులో 28 ఏళ్ల కుర్రవాడైన తేజస్వికి పోటీ చేసే అవకాశం దక్కింది. తేజస్వి రాత్రికి రాత్రి పాలిటిక్స్ లోకి వచ్చిన వ్యక్తి కాదు. స్టూడెంట్ రోజుల్లో ఏబీవీపీలో పనిచేశాడు. ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ - బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగాపాల్గొని ‘ఫైర్ బ్రాండ్’గా గుర్తింపు పొందాడు. అనేకసార్లు తేజస్వి కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంలో భాగంగా తేజస్వికి టికెట్ ఇచ్చింది. ఏబీవీపీలో పనిచేసినందున తేజస్విపై ఓ వర్గం కక్ష కట్టి ఈ హత్యకు స్కెచ్ వేసినట్లు తేలింది.