Begin typing your search above and press return to search.

ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీ ఎగిరిపోతుందట...?

By:  Tupaki Desk   |   21 April 2023 8:00 AM GMT
ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీ ఎగిరిపోతుందట...?
X
రాజకీయ జ్యోతీష్కులు ఎక్కువ అయిపోయారు. అన్నీ తమకు తెలిసినట్లుగా చాలా మంది జాతకాలు చెప్పేస్తున్నారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఏపీకి బాబే సీఎం అని తెలుగుదేశం తమ్ముళ్లు ఒక వైపు జోస్యాలు చెబుతూంటే ఏపీలో 2024 ఎన్నికల తరువాత ఒక ప్రాంతీయ పార్టీ ఎగిరిపోవడం ఖాయమని బీజేపీ నేత ఒకరు శుభం పలుకుతున్నారు.

ఆయన ఎవరంటే ఏపీ బీజేపీలో ప్రధాన నాయకుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో 2024 ఎన్నికల్లో మా తడఖా చూపిస్తామని ఒక వైపు చెబుతూనే మరో వైపు ఒక ప్రాంతీయ పార్టీ అంతర్ధానం అయిపోవడం తధ్యమని చెబుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పబోయేది దేని గురించి అన్న చర్చ ముందుకు వస్తోంది.

ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మూడవ ప్రాంతీయ పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీ బీజేపీకి మిత్ర పక్షంగా ఉంది కాబట్టి దాని గురించి ఆయన చెబుతున్నారని ఎవరూ అనుకోరు. కానీ విష్ణు వర్ధన్ రెడ్డి ఆ రెండు పార్టీల గురించే మాట్లాడి ఉంటారని అంటున్నారు.

అధికారంలో ఉన్న వైసీపీని ఓడిస్తామని ఒక వైపు చెబుతూ ఒక ప్రాంతీయ పార్టీ వాష్ ఔట్ అని ఆయన అనడంలో అంతరార్ధం ఏంటి అన్నదే చర్చగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తమకు జనసేనతోనే పొత్తు ఉందని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విష్ణు సహా బీజేపీ నేతలు చెబుతున్నారు.

అలాంటపుడు ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ఉండదు అంటే కచ్చితంగా తెలుగుదేశం గురించి కూడా ఆయన చెప్పారని అనుకోవచ్చా అన్నదే చర్చగా ఉంది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం కాకపోతే వైసీపీ ఉంది. ఓడిన తరువాత వైసీపీ మీద కూడా పడి దాన్ని మొత్తానికి మొత్తంగా లాగేసే వ్యూహం ఏదైనా ఉందా అన్నదే మరో చర్చగా ఉంది.

ఏపీలో ఈ రెండు పార్టీలను బీజేపీ ఇపుడు సవాల్ చేస్తోందా అన్నది కూడా డౌట్ గా ఉంది. నిజానికి ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ జనసేన పోటీ చేస్తే కచ్చితంగా చాలా సీట్లు వస్తాయని కమలనాధులు నమ్ముతున్నారు.

ఆ విధంగా చేసి ఏపీలో హంగ్ అసెంబ్లీని తీసుకునివచ్చి అపుడు ఆపరేషన్ ఏపీని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు అని అంటున్నారు ఆ మధ్యన ఇదే విష్ణు వర్ధన్ రెడ్డి ఏక్ నాధ్ షిండేలు ఏపీలో కూడా ఉన్నారని చెప్పారు. ఇలా ఆయన మాటలు ప్రకటనలు అన్నీ కనుక చూసుకుంటే మాత్రం ఏపీలో బీజేపీ ఏదో విధంగా పవర్ లోకి రావడానికి స్కెచ్ గీస్తోంది.అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీని ఒకదాన్ని లేపేయడానికి బీజేపీ చూస్తోందా అన్న చర్చ వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో,.