Begin typing your search above and press return to search.

బోరున విలపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య

By:  Tupaki Desk   |   15 March 2023 5:05 PM GMT
బోరున విలపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య
X
భారత్‌ రాష్ట్ర సమితి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య భోరున ఏడ్చేశాడు. చిన్న పిల్లాడిలా గుక్కపట్టి కంటతడి పెట్టాడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇటీవలి వార్తల నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. చర్చి లీడర్ పుట్టినరోజు వేడుకలో మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై తనను తాను సమర్థించుకున్నారు.

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య ఆరోపణలను తిప్పికొడుతూ తన రాజకీయ ప్రత్యర్థులు తన రాజకీయ జీవితాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆత్మవిశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆయన వ్యతిరేకులకు సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే రాజయ్య తనపై కొందరు వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఐదోసారి బలమైన మెజారిటీతో గెలుస్తానని హామీ ఇచ్చారు.

తన కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తానే గెలుస్తానని రాజయ్య శపథం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.