Begin typing your search above and press return to search.
రాజయ్య మళ్లీ రెచ్చిపోయారుగా.. కడియంకు సవాల్.. రగిలిన ఘనపూర్
By: Tupaki Desk | 9 July 2023 11:33 PM GMTతెలంగాణ రాజకీయాల్లో కొన్నాళ్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్సెస్ ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కొన్నాళ్ల కిందటి వరకు సర్పంచ్ నవ్యతో వివా దం కొనసాగించిన రాజయ్య.. తాజాగా కడియం కేంద్రంగా రెండు రోజుల నుంచి హాట్ కామెంట్లు చేస్తూ.. పొలిటికల్ వేడి పుట్టిస్తు న్నారు. ఆదివారం మరోసారి ఆయన రెచ్చిపోయారు. ఏకంగా కడియంకు.. ``నువ్వో నేనో తేల్చుకుందాం రా!`` అంటూ సవాల్ రువ్వారు. దీంతో ఘనపూర్ రాజకీయం మరింత గరంగరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని రాజయ్య తాజాగా నిప్పులు చెరిగారు. కడియం ఎమ్మెల్యే కాకముందు సరిగా ఇల్లు కూడా లేదని.,. కానీ, మంత్రి అయ్యాక ఆయన వేల కోట్లు పోగేసుకున్నాడని ఆరోపించారు. ఈ సొమ్మంతా ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కడియంకు రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని రాజయ్య నిలదీశారు. హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, మలేషియాలో వేల కోట్ల ఆస్తులు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ.. ఎవరిని మోసం చేసి సంపాయించుకున్నారో చెప్పాలని రాజయ్య డిమాండ్ చేశారు.
దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని, దమ్ముంటే రచ్చబండల దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. సమయమిస్తే ఆయన అవినీతిని బయటపెడతానని వ్యాఖ్యానించారు. ``కడియం రంగులు మార్చే ఊసరవెల్లి. స్టేషన్ ఘనపూర్ నా గడ్డ - నా అడ్డ.'' అంటూ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరితో అమితుమీకి సిద్ధమైనట్టు చెప్పారు. శ్రీహరి కులంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోందని, ఆయన తల్లి పద్మశాలి కులస్థురాలని రాజయ్య చెప్పారు.
రిజర్వేషన్లు దుర్వినియోగం చేస్తున్నారని, తాను ఎస్సీ వ్యక్తినంటూ ఎన్నికల్లో రిజర్వేషన్ పొందుతున్నారని కడియంపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంలో కనిపించని ఆయన ఇప్పుడు తిరుగుతున్నారని విమర్శించారు. "కడియం శ్రీహరికి అహం ఎక్కువ. ఆయన్ను దళిత దొర అని పిలుస్తారు. దమ్ముంటే చూసుకుందాం రా... దేనికైనా సై." అంటూ తీవ్ర వ్యాఖ్యలు విసిరారు.