Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న బాబు... మ్యాటరేంటి... ?

By:  Tupaki Desk   |   28 Jan 2022 9:42 AM
ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న బాబు... మ్యాటరేంటి... ?
X
చంద్రబాబు రాజకీయం మరో మారు పదును తేరుతోంది. ఆయన పక్కా ప్లాన్ తో హస్తిన పయనం కడుతున్నారు అని టాక్. గత ఏడాది చివరలో బాబు ఢిల్లీ టూర్ పెట్టుకుని వెళ్ళారు. ఆయన అనుకున్నట్లుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలవడం కుదరలేదు. అయితే ఈసారి మాత్రం కచ్చితమైన కార్యచరణతోనే బాబు ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారని టీడీపీలో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం 2022 నడుస్తోంది. అంటే వైసీపీ సర్కార్ కి మెజారిటీ అధికార కాలం అయిపోయింది. ఇక మిగిలిన రెండేళ్ళల్లో చివరి ఏడాది ఎన్నికలకు పోతుంది. దాంతో ఒక్క ఏడాది నెట్టుకువస్తే చాలు పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వతావరణం వెళ్లిపోతుంది. అదొక ఆలోచన అయితే ముందస్తు ఎన్నికలు జమిలి ఎన్నికలు అంటున్నారు.

దాంతో వీటిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్లాన్ తో టీడీపీ ఉంది. ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీకి అనుకూలంగానే రాజకీయం ఉంది. ఏపీ బీజేపీ వరకూ చూసుకుంటే చీటికీ మాటికీ బాబుని విమర్శించే సోము వీర్రాజు తన స్టీరింగ్ ని జగన్ మీదకు ఒక్కసారిగా మార్చారు. ఆయన వైసీపీ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నరు.

ఇక జనసేనతో వన్ సైడ్ లవ్ ట్రాక్ అలాగే సాగుతోంది. ఆ పార్టీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కచ్చితంగా వస్తుంది అన్న ఆశలు ఉన్నాయి. వీటితో పాటు ప్లాన్ బీ లో చూసుకుంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎలాగూ ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా కేంద్ర బీజేపీ మద్దతు మాత్రం అవసరం అని టీడీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోందిట. కేంద్రం అండ ఉంటేనే తప్ప 2024లో విజయం సిద్ధించదు అన్న ఆలోచనలు ఉన్నాయి.

పైగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలు కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయే మరో మారు కేంద్రంలో బొటాబొటీతో అయినా అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. దాంతో బీజేపీతోనే కలసి వెళ్తేనే మరో మారు ఏపీకి సీఎం కావడం ఈజీ అన్న లెక్కలతో బాబు ఉన్నారు. అందుకే ఆయన అర్జంటుగా ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఈసారి టూర్ లో చాలా షాకింగ్ పరిణామాలు జరుగుతాయని అంటున్నారు.

బాబు మోడీ, అమిత్ షాలతో భేటీలు వేయడం ద్వారా బీజేపీతో మద్దతు ఉందని మొత్తం ఏపీ క్యాడర్ కే కాకుండా ఏపీలో వైసీపీకి కూడా చెప్పాలనుకుంటున్నారు. ఈ ఒక్క భేటీతోనే పొత్తులు కుదిరిపోతాయన్న ఆశలు లేకపోయినా పొలిటికల్ గా ఇరు పార్టీల మధ్య పాజిటివ్ వాతావరణం అయితే వస్తుంది అన్నదే బాబు దూరాలోచన. మొత్తానికి ఏపీలో లా అండ్ ఆర్డర్ అసలు బాగాలేదు అన్న భారీ కంప్లైట్ తో కేంద్ర పెద్దలను బాబు కలవబోతున్నారు అంటున్నారు. మరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతున్నాయి.

ఈ టైమ్ లో మోడీ, అమిత్ షా కాస్తా ఖాళీగానే ఉంటారు. దాంతో వారితో భేటీకి బాబు వంతు ప్రయంత్నాలు అపుడే ఢిల్లీలో మొదలైపోయాయి అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే మాత్రం ఢిల్లీ నుంచే వైసీపీ వెన్నులో ప్రకంపనలు పుట్టించేలా రాజకీయాన్ని రాజేయాలని బాబు భావిస్తున్నారుట. చూడాలి మరి. ఏం జరుగుతుందో.