Begin typing your search above and press return to search.

బాలయ్యతో దోస్తీ..పాత వాసనలు పోని టీఆర్ ఎస్ ఎంపీ

By:  Tupaki Desk   |   5 Jan 2020 10:29 AM GMT
బాలయ్యతో దోస్తీ..పాత వాసనలు పోని టీఆర్ ఎస్ ఎంపీ
X
చింత చచ్చినా పులుపు చావదంటారు.. టీడీపీలో పుట్టి పెరిగి ఆ పార్టీ తరుఫున ఎంత ఎత్తుకు ఎదిగిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీగా కీలక మైన స్థానంలో ఉన్నారు. అయినా నామాకు పాత వాసనలు పోవడం లేదు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆపార్టీలో ఉన్నప్పుడు నమ్మినబంటుగా ఉండే వారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. ఆయన బావ మరిది, టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణతో రాసుకుపూసుకు తిరిగేవారు..కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి మారి.. ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేతగా నామా ఉన్నారు. టీడీపీ అంటేనే గులాబీ పార్టీకి పడదు. అయినా కూడా నామా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలయ్యతో కలిసి తాజాగా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో కనిపించారు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియామకమైన రాఘవరావు నియమాకపత్రాన్ని బాలయ్యతో కలిసి నామా అందించారు.

ఇలా గులాబీ పార్టీలో ఉన్నా ఇంకా ‘పచ్చ’ వాసనలు పోగొట్టుకొని నామా వైఖరి చర్చనీయాంశంగా మారింది. మరి సేవ గా చూసి దీన్ని గులాబీ బాస్ లైట్ తీసుకుంటారో.. ఎలా స్పందిస్తాడో చూడాలి.