Begin typing your search above and press return to search.
అమెరికాలో భగవద్గీత పఠనం... 10వేల మంది హాజరు!
By: Tupaki Desk | 4 July 2023 10:49 AM GMTభగవద్గీత అనేది పూజా, పునస్కారాల గురించి వివరించే గ్రంధం కాదని.. నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని గురించి ఏ విధంగా వ్యవహరించాలో తెలియచెప్పే సమగ్ర మహద్గ్రంథం అని చెబుతుంటారు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉండగా, వాటిల్లో ఒక్క శ్లోకం తెలుసుకున్నా మానవ జీవనం తరిస్తుందని అంటుంటారు.
ఈ క్రమంలో గీత చదివితే మనిషిలో ఉన్న ధ్వని తరంగాలు బాగా మేల్కొంటాయని కొంతమంది చెబుతుంటారు. ఇదే సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. ఏ విధంగా నడుచుకోవాలి.. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి.. ఉద్రిక్తతలను - ఆవేశాలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అనే విషయాలన్నీ గీతా పఠనం ద్వారా అవగతం అవుతాయని చెబుతుంటారు.
ఈ సమయంలో అమెరికాలో భగవద్గీత పఠనం రికార్డ్ స్థాయిలో జరిగిందని తెలుస్తుంది.
అవును... అమెరికాలోని టెక్సాస్ లో గురుపౌర్ణమి సందర్భంగా భగవధీత పఠనం జరిగింది. అలెన్ ఈస్ట్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 10వేల మంది భారతీయులు పాల్గొన్నారని తెలుస్తుంది.
వీరిలో నాలుగేళ్ల చిన్నపిల్లల నుంచి 84 ఏళ్ల వృద్ధుల వరకూ పాలుపంచుకున్నారని అంటున్నారు. యోగ సంగీత, ఎస్.జి.ఎస్. గీతా ఫౌండేషన్ లు సంయుక్తంగా ఈ ఈవెంట్ నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గణపతి సచ్చిదానంద స్వామీజీ... "ఉపనిషత్తులు మానవ జీవిత లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని తెలియజేస్తే.. భగవద్గీత వాటిని సాధించడానికి, పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి మార్గాన్ని సూచిస్తుంది. భగవద్గీత చూపిన ఆ మార్గాన్ని నమ్మకంగా అనుసరించడం ద్వారా మనిషి తన జీవితాన్ని ఉత్కృష్టంగా మార్చుకోగలడు" అని తెలిపారు!