Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వచ్చి మోడీతో ఫోటో దిగుతారు.. ఏపీలో ఒక్క ఫోటో లేదేం?
By: Tupaki Desk | 23 Jun 2023 3:00 PM GMTకేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. ఏపీని పర్యటిస్తున్న ఆమె కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అక్కడున్న పరిస్థితులపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి పాలకొల్లు టిడ్కో సముదాయాల మీద ప్రధానమంత్రి అవాస్ యోజన అన్న పేరు కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కానీ లేకపోవటంపై ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 'ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోటోలు దిగి.. కావాల్సిన నిధులు అడిగి తెచ్చుకుంటారు. కానీ.. ఏపీలో మాత్రం ప్రధాని ఫోటో కానీ.. కేంద్ర ప్రభుత్వ లోగో కానీ కనిపించటం లేదు' అని వ్యాఖ్యానించారు.
పేదలకు పెద్ద ఎత్తున పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత మోడీ సర్కారుకు దక్కుతుందన్న ఆమె.. తాను మరో రెండు నెలల్లో వస్తానని.. ప్రతి టిడ్కో అపార్టుమెంట్ మీదా ప్రధానమంత్రి అవాస యోజన అన్న పేరును రాసి ఉంచటంతో పాటు.. ప్రధాని ఫోటోలు ఉండాలన్నారు. నాలుగేళ్లుగా తమకు ప్లాట్లు కేటాయించలేదన్న పలువురు ఫిర్యాదుపైనా స్పందించారు.
వీధి దీపాలు వెలగటం లేదని కొందరు స్థానికులు చేసిన ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర మంత్రి.. కమిషనర్ వైపు సమాధానం కోసం చూడగా.. వెలుగుతున్నాయని చెప్పగా.. వెలగటం లేదన్న స్థానికులు పెద్ద ఎత్తున చెప్పటంతో సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
తన తర్వాతి పర్యటన వేళకు.. ఈ సమస్యలు ఏమీ ఉండకూడదన్నారు. ఏపీలోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి ఫీడ్ బ్యాక్ ఇవ్వటం ఖాయమంటున్నారు.