Begin typing your search above and press return to search.
కుమార్తెల కోసం ప్రపంచంలోనే అత్యంత విలువైన విల్లా కొన్న మనోడు
By: Tupaki Desk | 28 Jun 2023 5:00 AM GMTభారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఒకరు వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం.. తాజాగా ఆయన కొన్న ఖరీదైన విల్లానే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విల్లాను భారీ ధరను చెల్లించి మరీ సొంతం చేసుకున్నారు.
తమ ఇద్దరు కుమార్తెల కోసమే ఈ రాజభవంతి లాంటి భవనాన్ని కొనుగోలు చేయటమే కాదు.. దాన్ని పూర్తిగా రీడిజైన్ చేయించటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అతడెవరు? అంటే.. భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్.
ఆస్ట్రేలియాలో ఉండే ఆయన ఫ్యామిలీ ఆ మధ్యన స్విట్జర్లాండ్ కు మారింది. ప్రపంచంలోనే టాప్ 10 ఖరీదైన విల్లాల్లో ఒకటిగా చెప్పే విల్లాను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ అంచనా ప్రకారం ఈ డీల్ విలువ మన రూపాయిల్లో రూ.1649 కోట్లుగా వెల్లడించారు. ఈ విల్లా ఒకప్పుడు గ్రీక్ షిప్పింగ్ బిజినెస్ లో మాంచి పేరున్న అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్ కు చెందింది. ఆమె నుంచి పంకజ్ ఓస్వాల్ - రాధికా దంపతులు సొంతం చేసుకున్నారు.
ఈ ఖరీదైన విల్లాను పూర్తిగా మార్చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతను ప్రముఖ ఇంటిరీయర్ డిజైనర్ జెఫ్రీ విల్క్స్ కు అప్పగించారు. పంకజ్ ఓస్వాల్ విషయానికి వస్తే.. ఆయన భారత్ లోనే పెరిగారు. ప్రముఖ విద్యా సంస్థ మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే చదువుకున్నారు. రాధికాను పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె 24 ఏళ్ల వసుంధర ఓస్వాల్ కాగా.. రెండో కుమార్తె 19 ఏళ్ల రిది ఓస్వాల్. పెద్ద కుమార్తె ఒక సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రెండో కుమార్తె లండన్ లో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు.
వ్యాపార విషయాల్లోకి వస్తే పంకజ్ ఓస్వాల్ అగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్ టెక్ స్థాపించిన బిజినెస్ మాగ్నెట్ అభయ్ కుమార్ ఓస్వాల్ కుమారుడు. 2016లో ఆయన మరణించగా.. ఆయన వ్యాపారాల్ని పంకజ్ చూసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓస్వాల్ గ్రూప్ భాద్యతల్ని పర్యవేక్షిస్తున్న పంకజ్.. పెట్రో కెమికల్స్.. రియల్ ఎస్టేట్.. ఎరువులు.. మైనింగ్ రంగాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.