Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారా ?
By: Tupaki Desk | 29 Jan 2020 7:11 AM GMTకరోనా వైరస్...... చైనా లో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియా లో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా corona virus పరీక్షలు చేయించుకుంటున్నారు.
అయితే , ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని కాలజ్ఞాన రచయిత అయిన శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో 114 వ పద్యంలో చెప్పారంటూ గతంలో ప్రింట్ అయిన ఇమేజ్ ఒకటి ప్రస్తుతం
సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ !!శివ!! 114
ఈ పద్యాన్ని బాగా గమనిస్తే ..ఈశాన్య దిక్కున అని చెప్పారు ... భారతదేశానికి ఈశాన్యం గా చైనా ఉంది అలాగే అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి...ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ అదే నిజం అయితే పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోందని కొందరు భయపెడుతున్నారు. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు కొంచెం అటు ఇటుగా జరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దీనితో ఈ పద్యం పోస్ట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇకపోతే , 2020,జనవరి28, నాటికి చైనాలో కరోనా వైరస్ వ్యాధి భారిన పడి మరణించిన వారి సంఖ్య 106 కి చేరగా వ్యాధి లక్షణాలతో 1300 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారు ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నట్లు కొన్నివీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.